Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Coolie Teaser: రజినీకాంత్ కూలీ సినిమా టీజర్ లో ఇవి గమనించారా..?

Coolie Teaser: రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ‘తలైవా 171’ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టి సినిమా షూటింగ్ ను స్టార్ చేశారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ లోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి ‘కూలీ ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా టీజర్ ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లైతే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే మనకు అర్థం అవుతున్నాయి.

ఇక లోకేష్ కనకరాజ్ గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా స్మగ్లింగ్ ను బేస్ చేసుకొని ఈ సినిమా నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రజనీకాంత్ లాంటి ఒక స్టార్ హీరో ఈ సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం ఆయన పలికిన డైలాగ్ లే దీనికి మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ టీజర్ లో రజనీకాంత్ చాలా వింటేజ్ లుక్స్ తో కనిపించడం అనేది అతని అభిమానులకి కన్నుల పండుగగా మారబోతుందనే చెప్పాలి.

ఇక దీంట్లో లోకేష్ గత సినిమాల మాదిరిగానే డ్రగ్స్ మీద ఫోకస్ చేసి సినిమాను నడిపించవచ్చు. కానీ రజనీకాంత్ అంటే ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి నటిస్తే ఆ సినిమాను చూసే ప్రేక్షకుడి మీద చాలా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ఇక ప్రేక్షకుడి లో నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందనే ఉద్దేశ్యం తోనే గోల్డ్ బిస్కెట్స్ ని ఈ సినిమాలో స్మగ్లింగ్ కోసం వాడుకున్నట్టుగా తెలుస్తుంది.

డ్రగ్స్ కంటే గోల్డ్ మాఫీయా అనేది కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా టీజర్ లో రజనీకాంత్ ఒక అద్భుతమైన మాయాజాలం చేశారనే చెప్పాలి. రజినీకాంత్ గోల్డ్ మాఫియా కింగ్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా కూడా ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది…

Share the post

Coolie Teaser: రజినీకాంత్ కూలీ సినిమా టీజర్ లో ఇవి గమనించారా..?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×