Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pandikona Dog Breed : మగ చిరుత -ఆడ శునకాల క్రాస్ బ్రీడ్.. పందికోన వైల్డ్ డాగ్స్ చూస్తే చుచ్చుపోయాల్సిందే

Pandikona Dog Breed : కుక్కలకు పవర్ ఫుల్ పేరు ఒకటి ఉంది.. అదే గ్రామ సింహాలు. అడవికి సింహం రారాజు అయితే.. గ్రామాల్లో మాత్రం జంతువుల్లో కుక్కలదే ఆధిపత్యం. అయితే ఏపీలో ఓ గ్రామంలో అయితే కుక్కలు నిజంగా సింహాలను తలపిస్తాయి. సింహాల మాదిరిగా ఇతర జంతువులను వేటాడి వెంటాడి చీల్చి చెండాడుతాయి. అచ్చం సింహం రాజసం వాటిలో కనిపిస్తుంది. ఇంతకీ వాటి పేరు ఏంటో తెలుసా? పందికోన కుక్కలు. కర్నూలు జిల్లా పందికోన గ్రామానికి చెందిన ఈ శునకాలు ఖండాంతర ఖ్యాతిని దక్కించుకున్నాయి. అయితే చూడ్డానికి సాధారణ కుక్కల మాదిరిగా కనిపిస్తాయి. కానీ వాటికి కొంచెం అనుమానం కలిగినా అమాంతం దాడి చేసి చూపిస్తాయి.

ప్రస్తుతం పందికోన శునకాల ఖ్యాతి అంతటా మార్మోగుతోంది. పోలీస్ సేవలతో పాటు మూగజీవాలకు రక్షణగా ఈ శునకాలు నిలుస్తున్నాయి. పంట పొలాలకు కాపలాగా, రైతులకు సహాయకారులుగా పనిచేస్తున్నాయి. పౌరుషం, వేటాడే తత్వం, గాంభీర్యం వీటి సొంతం. ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న ఈ కుక్కలను ఎన్నారైల నుంచి పోలీస్ అధికారుల వరకు, ధనవంతుల నుంచి జంతు ప్రేమికుల వరకు కొనుగోలు చేస్తుంటారు. పందికోన గ్రామాన్ని సందర్శించి ఈ శునకాలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పందికోన గ్రామం. బ్రిటిష్ కాలంలో పాలే గాళ్లు పాలించేవారు. అడవులకు కూతవేటు దూరంలో ఉండడంతో చిరుత పులులు గ్రామంలోకి ప్రవేశించేవి. అలా ఓసారి గ్రామ సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించింది. దానికి పుట్టిన గ్రామంలో ఆడ కుక్కలతో సంచరించేదట. తరువాత ఆ మగ చిరుత పెరిగి గ్రామంలోని ఆడ కుక్కలతో జతకట్టడం వల్ల చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం అభివృద్ధి చెంది.. పందికోన శునకాల జాతి వృద్ధి చెందినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. గ్రామంలో సుమారు 700 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా కుక్కలను పెంచుకొని జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం ఆ గ్రామంలో 15 వందలకు పైగా శునకాలు ఉన్నాయి. ఈ శునకాలకు చిన్న వయసులోనే దేహం పై రెండు వైపులా వాతలు పెడతారు. వీటి కంటూ ప్రత్యేక ఆహారం ఉండదు. ఇంటి వద్ద వండే పప్పుతో కలిపిన అన్నం, జొన్న రొట్టెలు, మాంసంని ఇష్టంగా తింటాయి.

పందికోన గ్రామంలో పశువుల పెంపకం అధికం. రైతులు పెంచుకునే పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా నిలుస్తున్నాయి ఈ శునకాలు. ఎలాంటి క్రూర మృగాలనైనా ఇవి వేటాడుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ప్రవేశించే కొత్త వ్యక్తులను నిలువరించడం, దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఇక పంటలను ధ్వంసం చేసే అడవి పందులను ఇవి వేటాడే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. క్రమేపి పందికోన శునకాల విషయం అనతి కాలంలోనే ఇతర ప్రాంతాలకు పాకింది. ఇతర ప్రాంతాల వారు వచ్చి వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఒక సంస్థ 37 ఏళ్ల క్రితం గ్రామాన్ని సందర్శించింది. వాటి సంరక్షణకు నిధులు కేటాయిస్తామని చెప్పగా గ్రామస్తులు సమ్మతించలేదు. ప్రస్తుతం మన దేశంలోనే కేంద్ర రక్షణ శాఖ, పోలీస్ అధికారులు వీటిని పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ ఛానల్ ప్రతినిధులు గ్రామానికి వచ్చి ఈ శునకాలపై ప్రత్యేక అధ్యయనం చేసి వెళ్తుంటారు.

Share the post

Pandikona Dog Breed : మగ చిరుత -ఆడ శునకాల క్రాస్ బ్రీడ్.. పందికోన వైల్డ్ డాగ్స్ చూస్తే చుచ్చుపోయాల్సిందే

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×