Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

nayanthara to pair up with balayya again?

మిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నయనతార, తెలుగులో మాత్రం సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే డేట్స్ సర్దుబాటు చేస్తోంది. ముఖ్యంగా ఆమె ఇక్కడ చిరంజీవి – బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. తాజాగా ఆమె మరోసారి బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది సమాచారం. ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ సినిమా, ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య అంగీకరించారు.

అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందనేది టాక్. ఒక కథానాయికగా నయనతారను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ‘సింహా’ .. శ్రీరామరాజ్యం’ .. ‘జై సింహా’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళుతున్న సినిమా ఇది. ఇక మరో కథానాయిక పాత్ర కోసం రకుల్ .. సంయుక్త మీనన్ పేర్లను పరిశీలిస్తున్నారట. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది..!!

The post nayanthara to pair up with balayya again? appeared first on Telugu Swag.



This post first appeared on TELUGU CINEMA NEWS, please read the originial post: here

Share the post

nayanthara to pair up with balayya again?

×

Subscribe to Telugu Cinema News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×