మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బాబీ మరో జాక్ పాట్ కొట్టేశాడు. నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ బాలయ్య పుట్టినరోజు జూన్ 10న రానుంది. గతంలో బాబీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని వార్త వచ్చింది కానీ అదంతా గాలి మాటేనని తర్వాత క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే ఇన్ని నెలలు సైలెంట్ గా ఉన్న బాబీకి బాలయ్య రూపంలో ఒక పవర్ ఫుల్ మాస్ హీరో దొరికితే అంతకన్నా ఏం కావాలి.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ కాంబోలో మూవీ గురించి గతంలో ఆన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు పరస్పరం హింట్ ఇచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ ఎవరన్నది లాక్ చేయలేదు. బాబీ కూడా తొందరపడకుండా సరైన హీరో దొరకాలనే ఉద్దేశంతో మౌనంగా తన పని తాను చేసుకోవడం సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం భగవత్ కేసరి షూటింగ్ తో బిజీగా ఉన్న బాలయ్య ఇది పూర్తయ్యాక చేసే ఎన్బికె 109 బాబీదే అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది రూపొందనుంది..!!
Related Articles
The post balayya prefers bobby over boyapati? appeared first on Telugu Swag.