Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కబీర్ సింగ్ కుమ్మేస్తున్నాడు

Tags: agravedeg

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్‌ కపూర్‌, కైరా అద్వానీ నటించిన సినిమా రికార్డుల దిశగా దూసుకెళుతోంది. తొలిరోజు ఈ సినిమాకు 20.21 కోట్ల కలెక్షన్లు రాగా..ఈ సినిమా రెండోరోజు ఏకంగా రూ. 22.71 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తానికి రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద 42.92 కోట్లు సొంతం చేసుకుంది.

షాహిద్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్ళు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారత్, ఎవెంజర్స్‌ తర్వాత కబీర్‌ సింగ్‌ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

కబీర్ సింగ్ కుమ్మేస్తున్నాడు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×