హీరోయిన్ రెజీనాపై వచ్చినన్ని పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగినా..ప్రస్తుతం మాత్రం పెద్దగా ఎక్కడా కన్పించటం లేదు. అప్పుడప్పుడు మాత్రం అలా మెరిసి ఇలా వెళ్ళిపోతోంది. రెజీనా ఇటీవల కాలంలో చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదనే చెప్పాలి. అందాల అరబోతలో ఎంత రెచ్చిపోయినా రెజీనాకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. ‘ఆ!’ సినిమాతోపాటు ఇటీవల విడుదలైన సెవెన్ మూవీలోనూ వినూత్నమైన పాత్ర లు పోషించినా అవి అమ్మడికి పెద్దగా కలసి వచ్చినట్లు లేవు. ఇప్పుడు రెజీనాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటి అంటే ఈ నెల13న రెజీనా ఎంగేజ్ మెంట్ అయిపోయింది అనేది ఆ వార్త సారాంశం. అయితే దీనిపై ఇఫ్పటివరకూ రెజీనా ఎక్కడా అధికారికంగా స్పందించలేదు.
Related Articles
మౌనంగా ఉంది అంటే..అందులో నిజమే ఉండి ఉండొచ్చు అనే అంచనాకి వచ్చేస్తున్నారు కొంత మంది ఆమె అభిమానులు. కొద్ది కాలం క్రితం వరకూ ఈ 26 సంవత్సరాల భామ ఓ టాలీవుడ్ కుర్ర హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ పేర్కొన్నారు. ఓ సందర్భంలో రెజీనా మాట్లాడుతూ తన జీవితంలోకి ప్రేమ వచ్చి పోయిందని చెప్పింది. ఒకరినోకరం తొందరపడి దూరం అయినట్లు ఇప్పుడు అనిపిస్తోందని కూడా అని నిట్టూర్పులు విడుస్తోంది. ఆ తరువాత మొదటి ప్రేమికుడితో స్నేహం కొనసాగుతోందని రెజీనా చెప్పింది. ఇంతకీ రెజీనా పెళ్లి నిశ్చితార్థం విషయంలో నిజమెంత అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here