మహర్షి సినిమా కంటే ఈ సినిమా వసూళ్ళ లెక్కలు ఎక్కువ వివాదస్పదం అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన అంశంపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో స్పందించారనే చెప్పుకోవాలి. గతానికి భిన్నంగా మహేష్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు చెప్పుకుంటున్నట్లు సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు.
Related Articles
ఓ మూడు సినిమాలను కలిపి ‘మహర్షి’ తీసినట్లు ఉందనే విమర్శలు కూడా విన్పించాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే ఈ సినిమా గ్రాస్ వసూళ్ళు 175 కోట్ల రూపాయలకు చేరినట్లు పేర్కొన్నారు. అయినా సరే ఓవర్సీస్లో మహర్షి అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ మాత్రం కొంత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here