Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్టీఆర్..రామ్ చరణ్ ఇక దానికే అంకితం!

Tags: agravedeg

ఇక సమయం అంతా దానికే. ముందు అది పూర్తి చేసిన తర్వాతే ఏదైనా?. ఇంతకీ ఏంటి అది అంటారా?. అదేనండి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ సోమవారం నుంచి ప్రారంరభం అయింది. గతానికి భిన్నంగా ఈ సారి రాజమౌళి తన సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

                                            ఇప్పటికే కీర్తి సురేష్, పూజా హెగ్డె తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంత వరకూ వెలువడలేదు. ఇప్పుడు కొత్తగా ఓ పాత్రకు అదితి రావు హైదరీ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అత్యంత కీలకమైన రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కావటంతో త్వరలోనే చిత్రంలోని ఇతర నటీనటుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దర్శకుడు రాజమౌళి కోరినట్లు  ఎక్కువ సమయం కేటాయించటానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. సో..ఈ కొత్త సినిమా అప్ డేట్స్ ఇక నిత్యం రాబోతున్నాయన్నమాట.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఎన్టీఆర్..రామ్ చరణ్ ఇక దానికే అంకితం!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×