Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ క్లాప్

Tags: agravedeg

నందమూరి కళ్యాణ్ రామ్ దూకుడు పెంచాడు. వరస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన ‘జైలవకుశ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే కళ్యాణ్ రామ్ సినిమా ఎమ్మెల్యే కూడా బాక్సాఫీస్ వద్ద ఓకే అన్పించుకుంది. ఇప్పటికే నా నవ్వే సినిమాలో బిజీగా ఉన్న ఈ నందమూరి హీరో కొత్తగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు.

ఈ సినిమా షూటింగ్ బుధవారం నాడు ప్రారంభం కాగా…దీనికి హీరో ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్  ఈ చిత్ర నిర్మాణం చేస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్, షాలిని పాండే నటించనున్నారు. జై లవకుశ సినిమాలో కూడా నివేదా ఓ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరికృష్ణతోపాటు హీరోయిన్లు ఇద్దరూ పాల్గొన్నారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ క్లాప్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×