Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రామ్ చరణ్ ఇంటికెళ్ళిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అంతే కాదు..ఇద్దరు అగ్రహీరోల్లో ఒకరిది నెగిటివ్ రోల్ అనే సంచలన విషయం ప్రచారంలో ఉంది. అయితే  ఈ నెగిటివ్ రోల్ ఎన్టీఆర్ చేస్తారా?.లేక రామ్ చరణ్ చేస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అంతే కాదు..ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై అధికారికంగా ఎవరూ ఏమీ ప్రకటించకపోయినా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.   ఈ మధ్య రాజమౌళితో కలసి జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లు దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే తొలుత ఇది ఓ సరదా ఫోటో అనుకున్నారు..కానీ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలో ఎన్టీఆర్ గురువారం నాడు రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అయితే దీనికి సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రీ కిస్మస్ వేడుకల్లో భాగంగా రామ్ చరణ్ భార్య ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్ చెట్టు తయారు చేశారు. ఈ పంక్షన్ కు ఎన్టీఆర్ ఒక్కరే కాదు…మరో హీరో శర్వానంద్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.

The post రామ్ చరణ్ ఇంటికెళ్ళిన ఎన్టీఆర్ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

రామ్ చరణ్ ఇంటికెళ్ళిన ఎన్టీఆర్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×