Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కాంగ్రెస్ కు ఇది అవమానమే… కానీ అవసరమే

వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ఇది అవమానమే..కానీ అవసరమే. ఇదే ఎక్కువ మంది అభిప్రాయం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలపై ఎక్కువ మంది స్పందన ఇది. తెలంగాణలో ప్రస్తుతం పోటీ అధికార టీఆర్ఎస్..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ల మధ్యే. తెలుగుదేశం ఉన్నా..రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకోవటంతో దాని పాత్ర మరింత పరిమితం కానుంది. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఇక లాంఛనమే. అయితే కాంగ్రెస్ లో కూడా అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ తో  ‘ప్రచార బాధ్యతలు’ అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పలు విషయాల్లో వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నా..దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు సరైన నేత లేకపోవటం తెలంగాణలో విపక్షాలకు ఓ పెద్ద మైనస్ గా మారింది. రేవంత్ రెడ్డి ధీటైన నాయకుడిగా ఉన్నా..ఇప్పటివరకూ ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీ పాత్ర పరిమితం కావటం ఓ సమస్యగా మారింది. ఇఫ్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనుండటంతో ఆయనకు  ‘సరైన వేదిక’ దొరికినట్లు అవుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. మాటలతో  కెసీఆర్ ను ఢీకొట్టగలిగే ఏకైన నాయకుడు తెలంగాణ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక్కరే అన్నది నిస్సందేహం.

                                        అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక విచిత్రమైన నేతల ‘సమూహం’. పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నా..సొంత పార్టీ నేతలే వ్యతిరేక వ్యాఖ్యలతో పార్టీకి చేటు చేసే పరిస్థితి అక్కడ. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు రావటంతో తెలంగాణలో  ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం తెలంగాణ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆ పదవి నుంచి తప్పిస్తే తప్ప పార్టీ అధికారంలోకి రాదని కొంత మంది నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి లాంటి దూకుడు ప్రదర్శించే నేత కాంగ్రెస్ లో చేరటం ఆ పార్టీకి ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగానే భావిస్తున్నారు. దీనికితోడు రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర కూడా తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించటం ఖాయంగా భావిస్తున్నారు.

The post కాంగ్రెస్ కు ఇది అవమానమే… కానీ అవసరమే appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

కాంగ్రెస్ కు ఇది అవమానమే… కానీ అవసరమే

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×