చైనా మరో రికార్డు దిశగా పయనిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం దేశ రాజధాని బీజింగ్ లో రానుంది. దీని నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా?. భారతీయ కరెన్సీలో అయితే ఈ మొత్తం 78 వేల కోట్ల రూపాయలు (12 బిలియన్ అమెరికన్ డాలర్లు). ఈ విమానాశ్రయం 2019 అక్టోబర్ కే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం శరవేగంగా ఈ విమానాశ్రయం పనులు సాగుతున్నాయి. ఈ విమానాశ్రయం మొత్తం 47 చదరపు కిలోమీరట్ల మేర విస్తరించి ఉంటుంది.
Related Articles
ఈ విమానాశ్రయం ద్వారా తొలి దశలో ఏడాదికి 4.5 కోట్ల మంది ప్రయాణికులు దీని ద్వారా రాకపోకలు సాగిస్తారని అంచనా. తర్వాత దశలో ఈ మొత్తం పది కోట్ల ప్రయాణికులకు సేవలు అందించనుంది. ప్రస్తుత విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది దోహదపడగలదని అంచనా. ఈ కొత్త విమానాశ్రయ ప్యాసింజర్ భవనం డిజైన్లను దివంగత జాహ హడిడ్ రూపొందించారు.
The post ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం బీజింగ్ లో appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here