హైదరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. మైనర్ బాలికలను కూడా ఈ ఉచ్చులోకి దింపిన నిర్వాహకులు..అదే బాధిత బాలిక కారణంగా కటాకటాల పాలు కావాల్సి వచ్చింది. నగర శివార్లలోని ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో ఈ అక్రమ దందా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను కూడా కటకటాల వెనక్కి పంపారు. ఈ సెక్స్ రాకెట్ కు పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను కీలక సూత్రదారిగా గుర్తించారు.
Related Articles
గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్…..ఓ మైనర్ బాలికను బలవంతంగా వ్యవభిచారంలోకి దింపింది. ఈ బాధ భరించలేక బాధిత బాలిక…..ఈ రొచ్చు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు….అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి….మైనర్ బాలికను నరకకూపంలోకి లాగినట్లు సమాచారం.
The post పోలీసుల అదుపులో సెక్స్ రాకెట్ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here