Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చంద్రబాబు అభివృద్ధికి ‘మోడల్’ ఎలా అవుతారు?

Tags: agravedeg

చంద్రబాబు. పన్నెండేళ్ల ముఖ్యమంత్రి. గతంలో చేసిన తొమ్మిదేళ్లు..ప్రస్తుత మూడేళ్ళు కలుపుకుంటే. పదేళ్లు ప్రతిపక్ష నేత. కానీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోని కొన్ని స్కూళ్లలో పిల్లలు ఉపయోగించటానికి సరైన టాయిలెట్లు లేవు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ అసెంబ్లీ సాక్షిగా కొద్ది రోజుల క్రితం మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించిన వాస్తవం. పైగా తాను పుట్టిన నారావారిపల్లెను ‘ఆదర్శగ్రామం’గా మార్చేందుకు ఆయన కోడలు నారా బ్రాహ్మణీకి  దత్తత ఇచ్చారు. అంటే అక్కడ చేయాల్సిన పని ఇంకా  చాలా ఉందన్న మాటే కదా. మరి సొంత నియోజకవర్గాన్ని..సొంత ఊరును కూడా  సమస్యలు లేని వాటిగా తీర్చిదిద్దటంలో విఫలమైన చంద్రబాబు అభివృద్ధికి ‘మోడల్’ ఎలా అవుతారు?.. ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎందుకు వాటిని ఆదర్శ నియోజకవర్గం..ఆదర్శగ్రామాలు తీర్చిదిద్దలేకపోయారు. అయన అలా చేస్తే నిజంగా ఎవరైనా అభ్యంతరం చెబుతారా?. అందుకు అసలు నిధుల కొరత ఉంటుందా?. అంటే ఖచ్చితంగా అదేమీలేదనే చెప్పొచ్చు. మరి ఎందుకు చేయరు..చేయలేదు అంటే..సింపుల్.  చంద్రబాబు అభివృద్ధి రాజకీయ అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప…ప్రజల అవసరాలను బట్టి ఉండదు.

                            సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంలోని అరకువ్యాలీలో ఉన్న పెదలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం పరిస్థితి కూడా అంతే. అంటే దేశంలోనే తనంత సీనియర్  రాజకీయవేత్త ఎవరూ లేరని చెప్పుకునే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం..ఊరు..చివరకు దత్తత తీసుకున్న గ్రామంలోనూ అదే పరిస్థితి అన్న మాట.  తాజాగా ముగిసిన కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లో కూడా హామీలు అయితే భారీగా గుప్పించారు కానీ..ఈ మూడేళ్ళలో అక్కడ చేసింది శూన్యం. ఎటుచూసినా మురికికూపాలు..పందుల హల్ చల్. అభివృద్ధి చేయటాన్ని ఎవరూ ఆక్షేపించారు. అంత ఎందుకు?. సాక్ష్యాత్తూ కేబినెట్ లో మంత్రులుగా చెలామణి అవుతున్న పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసుల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

                                అవేమీ ఇప్పుడు పట్టించుకోరు ఎందుకంటే అక్కడ ఇప్పుడేమీ ఎన్నికలు లేవు కాబట్టి. పత్తిపాటికి చెందిన చిలకలూరిపేటలో అయితే కొన్ని చోట్ల వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి. తాజాగా ఎన్నికలు ముగిసిన నంద్యాల నియోజవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకంగా 1400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ ఇదే జోరు టీడీపీ మంత్రుల నియోజకవర్గాలు..ఎమ్మెల్యేల నియోకవర్గాల్లో ఎందుకు కన్పించదు అంటే…రీజన్ చాలా సింపుల్. అక్కడ ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు కాబట్టి. నంద్యాలకు ఇఛ్చినట్లు 1400 కోట్ల రూపాయలు కాదు..మంత్రుల నియోజకవర్గాలకు కనీసం 1000 కోట్లు..ఎమ్మెల్యే నియోజకవర్గాలకు 500 కోట్లు  ఇవ్వగలరా?. అంటే నో ఛాన్స్. అది జరిగే పనికాదనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టొచ్చు. సొంత ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అభివృద్ధికి నిధులు ఇవ్వని చంద్రబాబు అభివృద్ధికి మోడల్ ఎలా అవుతారు?.

The post చంద్రబాబు అభివృద్ధికి ‘మోడల్’ ఎలా అవుతారు? appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

చంద్రబాబు అభివృద్ధికి ‘మోడల్’ ఎలా అవుతారు?

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×