Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన ప్రతిష్టాత్మక వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన చేసిన 101వ సినిమానే ‘పైసా వసూల్’. ఈ సినిమాకు దర్శకుడు పూరీ జగన్నాధ్. వీరిద్దరి కాంబినేషన్ పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ‘పైసా వసూల్’ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే బాలకృష్ణ డైలాగులతో ప్రచారాన్ని హోరెత్తించారు. గతానికి భిన్నంగా బాలకృష్ణతో వెరైటీగా డైలాగులు చెప్పించాడు దర్శకుడు పూరీ. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన బాలకృష్ణ 101వ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం…ఇక సినిమా కథ విషయానికి వస్తే అసలు కథ కంటే కూడా బాలకృష్ణ నటన..డైలాగ్ డెలివరీనే ఈ సినిమాకు ప్రాణం. గత సినిమాలకు భిన్నంగా  ఈ సినిమాలో బాలకృష్ణ నీట్ గా..ఫుల్ ఎనర్జిటిక్ గా ప్రేక్షకులను ఆలరించాడు.

                             బాలకృష్ణ ఈ సినిమాలో ఓ వైపు రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారిగా…మరో వైపు మాఫియా గ్రూపులతో తలపడే ‘తేడా సింగ్’గా కన్పిస్తాడు. పూరీ జగన్నాధ్ ఈ సినిమాకు కూడా మాఫియా గ్యాంగ్ కథనే ఎంచుకున్నాడు. భారత్ లోని రాజకీయ నేతలతో కలసి బాబ్ మార్లే(విక్ర‌మ్ జీత్‌) భారత్ తో పాటు పలు దేశాల్లో పలు అక్రమ  దందాలు నడిపిస్తుంటాడు. పోర్చుగల్ కేంద్రంగా ఉంటూ..ఈ దందా సాగిస్తాడు. బాబ్ మార్లేకు తమ్ముడు సన్ని (అమిత్) అంటే ఎంతో ఇష్టం. ఏది అంటే అది ఇచ్చేస్తాడు. రా ఆఫీసర్ గా ఉన్న బాల  ఓ గొడవలో  సన్నీని చంపేస్తాడు. అప్పటి నుంచి బాబ్ మార్లే..తేడా సింగ్ ల మద్య వార్ నడుస్తుంది. ఈ పని కోసం భారత్ లో మినిష్ట‌ర్‌గా ఉన్న కృష్ణ‌కాంత్‌ సాయంతో ఈ పనిచేయాలని ఆదేశిస్తాడు.  భారత్ లో అడ్డగోలు దందాలు సాగిస్తున్న బాబ్ మార్లేను మట్టుపెట్టుందుకు చేసేందుకు ప్రయత్నాలను ఎప్పటికప్పుడు రాజకీయ నేతలు అడ్డుకుంటుంటారు.

                              అందుకే పోలీసు లు చేయాల్సిన పనిని మాఫియా గ్యాంగ్ తో చేయించాలని నిర్ణయించి..తేడా సింగ్ సాయం కోరతారు. రా ఆఫీసర్ గా ఉన్న బాల మాఫియా డాన్ గా తేడా సింగ్ గా ఎలా మారారు? అన్నది వెండితెరపైనే చూడాలి. రా చీఫ్ గా కబీర్ బేడి నటన సూపర్భ్ గా ఉంది. హీరోయిన్ శ్రియ రోల్ చాలా పరిమితంగానే ఉంది. శ్రియతోపాటు ముష్కాన్ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. బీబీసీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ గా పనిచేసే శ్రియ పోర్చుగ‌ల్ వెళ్లి క‌న‌ప‌డకుండా పోతుంది. అసలు పోర్చుగల్ లో ఏమి జరిగింది..శ్రియ ఎలా హత్యకు గురైంది అన్నది కూడా సస్పెన్స్ రేపుతుంది. పైసా వసూల్ సినిమా ఫస్టాఫ్ అయితే అప్పుడే అయిపోయిందా అనేంత కూల్ గా సాగిపోయింది. ఇందులో బాలకృష్ణ నటన..డైలాగులు..కామెడీ కూడా బాగానే పండింది. పాటలు కూడా కూడా ఓకే అన్పేంచేలా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే దసరా ఓ నెల రోజుల ముందే వచ్చినట్లు లెక్క. మిగిలిన వారికీ ‘పైసా వసూల్’ అవుతాయి.

రేటింగ్. 3.25/5

 

The post ‘పైసా వసూల్’ మూవీ రివ్యూ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×