అదీ ఏభై సంవత్సరాల మహిళను. రేప్ చేసిన కేసులో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇదంతా ఎక్కడ అంటారా?. కేరళలో చోటుచేసుకుందీ ఈ దారుణం. ఈ కేసులో పోలీసులు శనివారం నాడు ఎమ్మెల్యే విన్సెంట్ ను అరెస్టు చేశారు. ఐదుగంటలపాటు ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. 51 ఏళ్ల మహిళను వెంటాడి అత్యాచారం చేసి.. ఆత్మహత్యకు పూరిగొల్పినట్టు ఇప్పటికే ఆయనపై అదనపు అభియోగాలను ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు ఈ వివరాలను శుక్రవారం కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో పలువురు సాక్షుల నుంచి వివరాలు కూడా సేకరించారు.
Related Articles
ఈ జాబితాలో బాధితురాలి భర్త, సోదరుడు, ఇరుగుపొరుగు, బంధువులు ఉన్నారు. కొల్లం సిటీ పోలీసు కమిషనర్ అజితా బేగం నేతృత్వంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విన్సెంట్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉండటంతో ఆయనకు అండగా నిలిచేవిషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు తగ్గుతోంది. బాధిత మహిళ, ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ పోలీసులకు లభించడం.. అందులో ఎమ్మెల్యే విన్సెంట్‌పై మహిళ తీవ్ర అభియోగాలు చేయడంతో కేసులో కీలక సాక్ష్యంగా మారింది. ఇటీవల బాధిత మహిళ బలరాంపూర్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. చివరకు ఎమ్మెల్యే కటకటాల పాలు అయ్యారు.
The post రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్టు appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here