Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలంగాణ అప్పులు 159 శాతం జంప్

కొత్త రాష్ట్రం తెలంగాణ అప్పుల్లో మాత్రం దూసుకెళుతోంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇటీవల వరకూ రాష్టంలో అప్పుల 159 శాతం మేర పెరిగాయని సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి అప్పులు 159 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారంనాడు రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ ఎంఏ ఖాన్‌ అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 2014 జూన్‌ 2 నాటికి అంటే రాష్ట్రం ఏర్పడేనాటికి- తెలంగాణ అప్పులు 69,517 కోట్ల అప్పులు ఉండగా… 2019 మార్చి చివరినాటికి అవి రూ. 1,80,239 కోట్లకు చేరాయని వివరించారు.

గత రెండేళ్లుగా తెలంగాణ సర్కారు అప్పులపై వడ్డీనే పదకొండు వేల కోట్ల రూపాయలు పైనే చెల్లిస్తోంది. 2017-18లో చెల్లించిన వడ్డీ 11,139 కోట్ల రూపాయలు ఉంటే..2018-19లో ఆ వడ్డీ మొత్తం 11,691 కోట్ల రూపాయలకు పెరిగింది.    విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) అప్పులను టేకోవర్‌ చేయడానికి వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలకు ఒకసారి అనుమతించామని, అందులో ఉదయ్‌ పథకం కింద 2016-17లో రూ. 8923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణకు అనుమతించామని పేర్కొన్నారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

తెలంగాణ అప్పులు 159 శాతం జంప్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×