Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నరకాసురుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది

Tags: agravedeg

సందీప్ కిషన్ కు కాలం కలసి రావటం లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటీ సూపర్ హిట్ కావటం లేదు. దీంతో సినిమాలకు కూడా చాలా గ్యాప్ వస్తోంది. ఇప్పుడు ఒకప్పటి హీరో..ప్రస్తుతం రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న అరవింద్ స్వామితో కలసి నరకాసురుడు సినిమాలో నటిస్తున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమాలో శ్రియా కీలక పాత్ర పోషిస్తున్నారు.

కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్‌లో నరగసూరన్‌ పేరుతో రిలీజ్‌ కానుంది. 16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్‌ నరేన్‌ మరోసారి నరకాసురుడుతో తన సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు వర్షన్‌ను రమేష్‌ వర్మ ప్రొడక్షన్‌ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

నరకాసురుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×