రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్. కైరా అద్వానీ అందాల ఆరబోత. సూపర్ స్టెప్పులు. ఆకట్టుకునేలా సాగే పాట చరణాలు. అదే ఈ తస్సాదియ్యా సాంగ్. ‘రోమియో, జూలియట్ మళ్లీ పుట్టినట్లు ఉంటాదంట మన జట్టు, వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్లు మన లవ్ స్టోరీ హిట్టు’ అంటూ సాగే పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. మాస్ సినిమాలతో మాయాజాలం సృష్టించే బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమానే ‘వినయ విధేమ రామ’.
Related Articles
ఈ సినిమాలో రామ్ చరణ్ తో తొలిసారిగా కైరా అద్వానీ జోడీ కడుతోంది. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్యే ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాల్లో ఉంది. రంగస్థలం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ కొత్త సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here