Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Tags: agravedeguml

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరో కీలక అడుగు. అత్యంత కీలకమైన ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం (నవంబర్12)న విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో…జిల్లాల వారీగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 19. నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్  ను ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే జరపనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నియోజకవర్గాలు 13 ఉన్నాయి. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఎప్పటిలాగానే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగనుంది. అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల వేడి షురూ కాగా..ఇప్పుడు అది పీక్ కు చేరనుంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×