ఒక్క సినిమాతోనే ఆమె టాలీవుడ్ లో ‘ప్రత్యేక ముద్ర’ వేసుకున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని తేల్చిచెప్పారు. ఏకంగా తనకే నాలుగు రోజుల క్రితం ఈ అనుభవం ఎదురైందని సంచలన విషయం బయటపెట్టారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. బహుశా ఆర్ఎక్స్ 100 సినిమాలో తన క్యారెక్టర్ చూసి వాళ్ళు తనపై ఈ అంచనాకు వచ్చారేమో అని వ్యాఖ్యానించారు.
Related Articles
ఆ విషయంలో కాంప్రమైజ్ అయితే అవకాశం ఇస్తామంటూ ఆఫర్ వస్తే..దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించినట్లు తేల్చిచెప్పారు. తాను కష్టపడి ఇక్కడ వరకు వచ్చానే తప్ప…కాంప్రమైజ్ అయి కాదని వ్యాఖ్యానించారు. ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ తనను బాగా నిరుత్సాహానికి గురిచేసిందని తెలిపారు. తానేమీ కొత్తగా పరిశ్రమలోకి రాలేదని..తనకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారం రేపారు. ఇప్పుడు తాజాగా పాయల్ రాజ్ పుత్ కూడా ఇంకా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని వ్యాఖ్యానించటం ఈ వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here