Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమెరికా తెలుగు సంఘాల ‘తోలు బొమ్మలాటలు’

Tags: agravedeg

అమెరికా సెక్స్ రాకెట్ లో దొరికింది ఇద్దరే. అంత మాత్రాన మిగతా తెలుగు సంఘాల నేతలు అందరూ శుద్ధపూసలేనా?. అంటే ఎంత మాత్రం కాదనే సమాధానం వస్తోంది. తెలుగు సంఘాల నేతలు చేసే దందాలు చూసి..వీటితో ఏ మాత్రం సంబంధం లేని వారంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. నిజానికి తెలుగు సంఘాల సంక్షేమానికి..ఎంటర్ టైన్ మెంట్ కు హీరో..హీరోయిన్లు కావాల్సిందేనా?. వాళ్ళు లేకుండా  ఇవి ముందుకు సాగవా.. ? అసలు వీళ్ళ లక్ష్యం ఏమిటి?. ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే హాయిగా సినిమాకు వెళ్లొచ్చు. కావాల్సినన్ని సినిమాలు చూసుకోవచ్చు. తెలుగువాళ్ల సంక్షేమం..అభ్యున్నతి అనే పెద్ద పెద్ద మాటలు చెప్పి చేసే పనుల వెనక అసలు లక్ష్యాలు వేరు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం..వెలుగులోకి రాకుండా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో సినీ హీరోయిన్లు..రాజకీయ వేత్తలు..అమెరికాలో ఉండే తెలుగు ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ఈ వ్యవహారాలను దగ్గర నుండి చూసే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇందులో కొంత మంది మీడియా ప్రముఖుల పాత్ర కూడా ఉంది. ఇక్కడ అయితే ఎక్కడ దొరికితే పరువు పోతుందో అని తెలుగు సంఘాల సమావేశాల పేరుతో అమెరికా వెళ్లి అక్కడ చేయాల్సిన పనులు చేసి వెనక్కి వచ్చేస్తున్న వారి చరిత్రలు ఎన్నో. కాకపోతే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అడ్డంగా అమెరికా పోలీసులకు దొరకటంతో అందరూ ‘సైలంట్’ అయిపోయారు.

1999 నుండీ క్రమక్రమంగా  పతనావస్థలో ఉత్తర అమెరికాలోని తెలుగుజాతి ఖ్యాతి, తెలుగు సంఘాల పరువు ప్రతిష్టలు, దిగజారుతున్న తెలుగు సంఘాల నాయకత్వం. ఉత్తర అమెరికాలోని ప్రస్తుత తెలుగు సంఘాల మెజారిటీ నాయకత్వం అత్యధిక శాతం దళారీల చేతుల్లో ఉందనేది నగ్నసత్యం. అటువంటప్పుడు ఆ దళారీ నాయకుల అనుచరులు కూడా దళారీలు, విటులు లేదా తారుపుడు గాళ్లే ఆయుంటారు.  గత రెండు దశాబ్దాలుగా అమెరికాలోని తెలుగు సంఘాల నాయకత్వ తీరు క్రమక్రమంగా దిగజారుతూనే ఉంది. వ్యక్తిత్వం,  సంఘంలో పేరు మర్యాద గౌరవం ఏమాత్రం లేనివాళ్ళు నేడు అమెరికాలోని తెలుగు సంఘాలకు నాయకులుగా కొనసాగటం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. కొన్ని కారణాల వలన ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన షికాగో సెక్స్ రాకెట్ లాంటివి అమెరికాలో ఇంకా బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి. అటువంటి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నుండీ అమెరికాకు తెలుగు సంఘాల సమావేశాల ఉత్సవాల పేరుతో అక్కడకు ఎవరెవరు ఎటువంటి వ్యక్తులు వెళుతున్నారో, వారి చరిత్ర, వాళ్ళు ఇక్కడ చేసేపనులు ఏమిటో తెలియందికాదు.  ఈ సంఘాల ఉత్సవాలకు  ఇక్కడ నుండీ సినీ హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ నటులు, టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు, జూనియర్ నటులను స్థాయినిబట్టి బేరమాడి మాట్లాడి అక్కడకు పంపించడానికి ప్రతి సంఘానికి హైదరాబాదులో ఒక్కొ వ్యక్తి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు.

ఈ కోఆర్డినేటర్లకు సినీరంగంతో రాజకీయ రంగంతో అధికారగణంతో పారిశ్రామికవేత్తలతో మీడియా పెద్దలతో అన్నిరకాల విస్తృత సంబంధాలు ఉంటాయి. ఈ కోఆర్డినేటర్లు అందరూ అక్కడ తెలుగు సంఘాల నేతలకు అత్యంత సన్నిహితులు అయ్యుంటారు.  అమెరికా నుండి తెలుగు సంఘాల నాయకులు ఇక్కడకు వచ్చినప్పుడు వీళ్ళే ఇక్కడ  మీటింగులు అపాయింట్ మెంట్లు లాంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ సంఘాల ఉత్సవాల పేరుతో ఇక్కడ నుండీ నటీమణులు జూనియర్ ఆర్టిస్టులు లాంటివారిని అమెరికాకు పంపించి అక్కడకు ఇక్కడినుండీ అతిథులుగా వెళ్ళే ముఖ్యులకు ( రాజకీయ వ్యాపార ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు) ఎరవేయడం పరిపాటి.  ఇక్కడ ప్రైవసీ ఇబ్బందులు వలన ఈ రాజకీయనాయకులు అమెరికా తెలుగు సంఘాల ఉత్సవాలను వేదికగా వాడుకోవడం పరిపాటిగా మారింది. కొంత మంది ప్రస్తుత తెలుగు సంఘాల నాయకులుగా చలామణీ అవుతున్నవారు ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఐఏఎస్ ఐపీఎస్ లను అమెరికాకు ఆహ్వానించి వారిని అక్కడ లాస్ వేగాస్ లాంటి పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్లి వాళ్లకు అక్కడ “అన్ని ఏర్పాట్లు” చేయడం ద్వారా ఇక్కడ అన్నివిధాలా  లబ్ధిపొందుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతూ ఎన్నారై పేరుతో ప్రాపకం పొందుతూ, ఇక్కడ అధికారంలో ఉన్నవారి సన్నిహితులను అమెరికా తీసుకెళ్లి సేదతీరుస్తుంటారు. ఇది 1997 నుండీ మొదలై నేటివరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

దురదృష్టవశాత్తు కొంతమంది ఈ ఎన్నారై దళారీలు ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు సలహాదారులుగా పదవులలో ఉంటూ రాజకీయం కూడా చేస్తుంటారు. ఇటువంటి దళారీ ఒకడు అమెరికాలో ఒక హిందూ దేవాలయాన్ని నిర్వహిస్తూ సంవత్సరానికి ఆ దేవాలయానికి వచ్ఛే కనీస ఆదాయం పదికోట్ల రూపాయిలు దిగమింగుతున్నాడు. ఇతను ఇక్కడ గతంలో సాంస్కృతిక ఉత్సవాల పేరుతో మీడియా సంస్థలతో ఉన్న సంబంధాలను అడ్డంపెట్టుకుని బాగానే సొమ్ముచేసుకున్నాడు. అటువంటి మరోవ్యక్తి గతంలో ఒక దివంగత నేతకు సన్నిహితంగా ఉండి ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రికి ఆయన కుమారునికి అత్యంత కీలక సన్నిహితుడుగా మారాడు. అమెరికాలో తెలుగు సంఘాల ఉత్సవాలు జరిగే ప్రదేశాలలో ఆ రెండు మూడు రోజులపాటు అక్కడ జరిగే పనులను, సంఘనాయకుల తీరును, సంఘాల సభ్యుల ప్రవర్తన చూస్తే సభ్యసమాజం సిగ్గుతో చచ్చిపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నారై ప్రతినిధులుగా ముఖ్యులతో ముఖ్యుల కుటుంబసభ్యులతో అంటకాగుతూ హడావుడి చేస్తున్నవారిలో మెజారిటీ శాతం ఈబాపతు గాళ్లే ! మనం ఒకప్పుడు అమెరికా అంటే ఎంతో ఉన్నతంగా ఊహించుకునేవాళ్ళం. అక్కడకు ఉన్నత చదువులకొఱకు ఉద్యోగాల కోరలు వెళ్లి స్థిరపడిన వాళ్ళు అంటే మనకు ఎనలేని గౌరవమర్యాదలుండేవి. ఒకమాటతో ముగిస్తా….. ఈ బ్యాచ్ గనక అమెరికా వెళ్లకుండా అమీర్ పేటలోనే ఉండుంటే ఈపాటికి తెలుగురాష్ట్రాలలో కలరా వ్యాధి ప్రబలి ఉండేది !  ఈ చెత్తను భరిస్తున్న అమెరికా దేశానికి మాత్రం తెలుగుజాతి తరపున నాయొక్క శతకోటి వందనాలు.

(ఈ మెయిల్ లో వచ్చిన కథనం యధాతధంగా)

-సువేరా



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

అమెరికా తెలుగు సంఘాల ‘తోలు బొమ్మలాటలు’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×