Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘భరత్ అనే నేను’ చూసిన కెటీఆర్

Tags: agravedeg

నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించటమే అసలైన నాయకుడి లక్షణం. ఇదీ భరత్ అనే నేను సినిమా ప్రధాన ఉద్దేశం. మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ రాజకీయ నేపథ్య సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ విషయాన్ని ఆ సినిమా కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమాపై విచిత్రంగా రాజకీయ వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

సీపీఐ నేత రామకృష్ణ ఏకంగా తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులు ఇద్దరూ ఈ సినిమా చూడాలని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ‘భరత్ అనే నేను’ సినిమాను వీక్షించారు. అంతే కాదు..సినిమా చాలా బాగుందని చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాతో పాటు భారత్ లోనూ ఈ సినిమా  భారీ ఎత్తున వసూళ్లు రాబడుతోంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘భరత్ అనే నేను’ చూసిన కెటీఆర్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×