డ్రంకన్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయింది. మూడేళ్ల పాటు ఆయన లైసెన్స్ ను రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆయనకు 2100 రూపాయలు జరిమానా కూడా విధించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రదీప్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన కొద్ది రో జులు కన్పించకుండా పోవటం…వీడియో ద్వారా సందేశం పంపించటం వంటివి హల్ చల్ చేశాయి.
Related Articles
షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే కౌన్సిలింగ్ కు హాజరుకాలేకపోయానని తెలిపిన ప్రదీప్ తర్వాత కౌన్సిలింగ్ కు కూడా హాజరయ్యారు. శుక్రవారం నాడు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు జరిమానా విదించటంతోపాటు మూడేళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. నూతన సంవత్సరం రోజు ప్రదీప్ మోతాదుకు మించి ఎక్కువ మొత్తంలో మద్యం సేవించినందున శిక్ష కూడా పడుతుందని ప్రచారం జరిగింది. అయితే కోర్టు మాత్రం లైసెన్స్ రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకుంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here