Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సెప్టెంబర్ 1న ‘జవాన్’ వచ్చేస్తున్నాడు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్ కి సిద్ద‌మ‌వుతుంది.  విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ కి, మెద‌టి లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.
Sai DharamTej BVS Ravi Jawaan ready to release on September 1st
జ‌వాన్ అంటే అస‌లు ఏలాంటి క‌థ అనే చర్చ అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్ష‌కుల్లో ను ఆశ‌క్తి నెల‌కొంది. హీరో సెల్‌ఫోన్ ప‌ట్టుకుని ఎమెష‌న‌ల్ గా వుండ‌టం, మోబైల్ లో ఓ ఫ్యామిలి ఫోటో వుండ‌టం చూస్తే ఇది పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించేలా వుంద‌ని కొంత‌మంది అంటుంటే.. హీరో హ్యండ్‌స‌మ్ గా హ‌కీ స్టిక్ ప‌ట్టుకుని కాలేజ్ గేట్ ద‌గ్గ‌ర బైక్ మీద స్టైలిష్ గా నిల్చున్న స్టిల్ చూసి ఇది ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని కొంత‌మంది అంటున్నారు. అయితే ఇది ప‌క్కాఫ్యామిలి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపోందుతుందని యూనిట్ స‌బ్యులు చెబుతున్నారు. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ….  ద‌ర్శ‌కుడు బివిఎస్ రవి చెప్పిన కథ చెప్పిన‌ట్టే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కించాడు. మా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోయిన్ మెహ‌రిన్ లు స్రీన్ మీద చాలా అందంగా వుంటారు.  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  ఈ చిత్రాన్ని నిర్మించాం. చిత్రానికి సంభందించి మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో, అన్నికార్య‌క్ర‌మాలు ఆగ‌స్టులో కంప్లీట్‌ చేసి సెప్టెంబ‌ర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తాము. ఈ చిత్రం మెగాఅభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

See Also: జైలవకుశ సీన్లు లీక్ – పోలీసులకు ఫిర్యాదు

దిల్ రాజు మాట్లాడుతూ…. సాయి ధరమ్ తేజ్ ,బివిఎస్ రవి కాంబినేష‌న్ లో చేస్తున్న చిత్రం జవాన్ . సాయి ధరమ్ తేజ్ ఈ క‌థ‌లో ఇన్‌వాల్వ్ అయ్యి మ‌రీ చేస్తున్నాడు.  ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా  బాగా వచ్చింది. అని అన్నారు
దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ…   జ‌వాన్ చిత్రం కాన్సెప్ట్ ఎంట‌ని అంద‌రూ అడుగుతున్నారు. మా మెద‌టిలుక్ అంద‌రిలో ఆ క్యూరియాసిటి తెచ్చింది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ని ఎలా చూపించ‌బోతున్నారు అని అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండ‌స్ట్రి ఫ్రెండ్స్ చాలా ఇంట్ర‌స్ట్ గా అడుగుతున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టివ‌ర‌కూ చెయ్య‌ని ఓ మంచి పాత్ర‌లో చేస్తున్నాడ‌నేది మాత్రం చెప్ప‌గ‌ల‌ను.

See Also: అదరగొడ్తున్నజవాన్ ఫస్ట్‌లుక్

దేశానికి జవాన్ ఎంత అవసరమో… ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో త‌న బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే మా కాన్సెప్ట్. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.  ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.

The post సెప్టెంబర్ 1న ‘జవాన్’ వచ్చేస్తున్నాడు appeared first on .This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

సెప్టెంబర్ 1న ‘జవాన్’ వచ్చేస్తున్నాడు

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×