Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చిక్కుముడి వీడిన ‘డెత్ సీక్రెట్స్’

సంచలనం రేకెత్తించి మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన బ్యూటీషియన్‌ శిరీష మృతి కేసులో మిస్టరీని చేధిస్తున్న పోలీసులు అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే పనిలో పడ్డారు.  శిరీష మృతిపై ఉన్న అనుమానాలకు స్పష్టత ఇస్తూ శిరీషది ఆత్మహత్యేనని పోలీసులు నిర్థారించారు.

Sirisha Suicide Death Secrets cracked and revealed

రాజీవ్‌కు నాలుగేళ్ళ క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైన శిరీష అతనికి చెందిన ఆర్‌జే స్టూడియోలో బ్యూటీషియన్‌గా చేరింది. అప్పటినుండి వీళ్ళిద్దరి మధ్య మొదలైన స్నేహం చనువుగా ఉండే వరకు వచ్చింది. ఈ మధ్యలో రాజీవ్‌తో కలిసి పనిచేస్తుండడం వల్ల అతని స్నేహితులు చాలామంది శిరీషకు కూడా పరిచయం అయ్యారు. బేగంపేటలోని ఓ స్కూల్‌లో షెఫ్‌గా పనిచేస్తున్న సతీష్‌చంద్రతో పెళ్ళి అయిన శిరీషకు 12ఏళ్ళ కూతురు ఉంది.

కుటుంబం ఉన్నప్పటికీ రాజీవ్‌తో కలిసి సాన్నిహిత్యంగా ఉంటున్న శిరీష కు రాజీవ్‌తో కూడా సంబంధాన్ని కొనసాగించింది. అదే సమయంలో గతేడాది ఫేస్‌బుక్‌లో రాజీవ్‌కు తేజస్విని అనే అమ్మాయి పరిచయం అయి ప్రేమగా మారి పెళ్ళి చేసుకుందామనుకొనే వరకు వెళ్ళింది. ఇదే సమయంలో రాజీవ్‌తో శిరీష క్లోజ్‌గా ఉంటుండడంతో తేజస్విని కల్పించుకొని శిరీషతో తరుచూ గొడవపడుతూనే ఉంది.

అదే సమయంలో లేటెస్ట్‌గా గత నెల 30వతేదీ ఉదయం 10 గంటలకు ఆర్జే స్టూడియోకి వెళ్ళిన తేజస్విని అక్కడ రాజీవ్, శిరీషతో గొడవపడడం అది పెద్తోదదవుతుండడంతో, రాజీవ్ డయల్ 100కి ఫోన్ చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రెండు రోజుల్లో విషయం సెటిల్ అవ్వకపోతే మళ్ళీ పోలీసులను అప్రోచ్ అవుతానని చెప్పి తేజస్విని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఈ విషయాన్ని సెటిల్ చేయాలని శిరీష తనకు ఏడాదిక్రితం పరిచయమైన శ్రవణ్‌ను అడిగింది.

అయితే  ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి శ్రవణ్‌ తనకు పరిచయం ఉన్న కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడి మొత్తం విషయం అతనికి చెప్పారు. అప్పుడు శ్రావణ్ చెప్పినది మొత్తం విన్నతరువాత ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి మరింత సమాచారం తెలుసుకుందామని తన బ్యాచ్‌మేట్ అయిన బంజారాహిల్స్ ఎస్‌ఐ హరీందర్‌కి ఫోన్ చేసి విషయాన్ని సెటిల్ చేయాలని అడిగారు.

అయితే ఈనెల 12తేదీ రాత్రి బంజారాహిల్స్‌లోని కప్పా కాఫీ షాపు దగ్గర కొంచంసేపు మాట్లాడుకున్న తర్వాత రాత్రి 8గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఈ ముగ్గురు ఎస్‌ఐ హరీందర్‌ను కలిస్తే డయల్ 100లో పిర్యాదు చేసిన్పపడు ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు విచారణ చేస్తున్నారు. ఫ్యామిలీ విషయం కాబట్టి కాస్త టైం పడుతుంది ఓ వారం తర్వాత వస్తే మాట్లాడుదాం అని చెప్పి పంపించేశారు. అయితే తేజస్వినితో జరిగిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని దానికి కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రబాకర్‌రెడ్డి దగ్గరికెళ్తే సెటిల్ అవుతుందని నిర్ణయానికి వచ్చి  అందరూ కలిసి రాత్రి 08:30 తర్వాత బయలుదేరి మొదట రోడ్ నెంబర్ 12లో వైన్ షాప్ దగ్గర మందు కొనుక్కొని, రాయదుర్గంలో స్నాక్స్ కొని ఔటర్ రింగ్‌రోడ్డు ద్వారా రాత్రి 11:30కి కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్‌కి చేరుకున్నారు.

పోలీస్ క్వార్టర్‌లో కొంచంసేపు మాట్లాడుకొని మందు తాగిన తర్వాత ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, రాజీవ్, శ్రావణ్‌లు సిగరెట్ తాగడానికి డోర్ తీసుకొని బయటికి వెళ్ళారు. అయితే అప్పుడు శిరీష‌ కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే బయటికొస్తే ఎవరైనా చూస్తారని చెప్పి లోపలికి పంపించేశాడు ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి. ముగ్గురు బయట నిలబడి సిగిరెట్‌ తాగుతూ మాట్లాడుతున్న సమయంలో కుకునూరుపల్లి స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న వేశ్యాగృహాలకు రాజీవ్, శ్రావణ్‌లు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే బాగుంటుందని ప్రభాకర్‌రెడ్డి చెప్పినప్పుడు విన్న శిరీషకు వాళ్ళపై అనుమానం మొదలైంది.

అయితే వేశ్యాగృహాలకి వెళ్ళడానికి రాజీవ్, శ్రావణ్‌లు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మందు తాగి కొంచంసేపు మాట్లాడుకున్న తర్వాత ఈసారి రాజీవ్, శ్రావణ్‌లు ఇద్దరూ సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళిన సమయంలో లోపలి నుండి శిరీష ఏడుపులు వినిపించి లోపలికి వచ్చి చూసేటప్పటికి శిరీష ఒకమూలకి నక్కి కూర్చోవడం, తాను అలాంటి మనిషిని కానని పెద్దగా ఏడుస్తుండడంతో అక్కడినుండి తీసుకెళ్ళాలని ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సూచించాడు.

అయితే శిరీష ఇంకా గట్టిగా ఏడుస్తూ అరుస్తుండడంతో ఆమెను సముదాయించడానికి రాజీవ్ రెండు దెబ్బలు వేశాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన కారులో ముగ్గురు కలిసి తిరిగి హైదరాబాద్‌కి వచ్చే సమయంలోనూ కారులో ఏడుస్తూ కూర్చున్న శిరీష నడుస్తున్న కారులోనుండి క్రిందికి దిగిపోవడానికి డోర్ తెరవగానే భయపడ్డ రాజీవ్ కారుని స్లో చేసిన వెంటనే శిరీష కారు దిగి బయటికి పరిగెత్తే పనిచేయడంతో కోపంతో రాజీవ్ శిరీష జుట్టుపట్టుకొని లాక్కొచ్చి కారెక్కించి తన ఫ్లాట్‌కి తీసుకొచ్చారు.

వాళ్ళు ఫ్లాట్‌కి వచ్చేసరికి ఉదయం 03గంటల 45 నిమిషాలు అయ్యింది.  ఆ తర్వాత కారు ఆగిన వెంటనే తన స్కూటీ తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఆర్‌జే స్టూడియోలోకి శిరీష వెళ్ళింది. ఆ తర్వాత  కొంతసేపు అయినప్పటికీ శిరీష క్రిందికి రాకపోవడంతో పది నిమిషాల తర్వాత ఫ్లాట్‌లోకి వెళ్ళిన తర్వాత రూంలో లైట్ వేసి ఉండడం, ఎంతసేపు డోర్ కొట్టినా శిరీష డోర్ తీయకపోవడంతో తను ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఉదయం వరకు వదిలేయాలని తనే సెటిల్ అయిపోతుందని శ్రవణ్ చెప్పి తనకు క్యాబ్ బుక్ చేయించుకొని అక్కడినుండి బయలుదేరాడు.

an-unreliable-twist-in-beautician-sirisha-and-kukunurpally-si-prabhakar-reddy-suicides

శ్రావణ్‌ను క్యాబ్ ‌ఎక్కించే సమయంలో శిరీష రాజీవ్‌కు వీడియో కాల్ చేసింది. అయితే పది నిమిషాల తర్వాత ఫోన్‌ చూసుకొన్న రాజీవ్ శిరీషకు వీడియోకాల్ చేయడానికి ప్రయత్నిస్తే తనవైపునుండి ఎలాంటి స్పందనరాలేదు. ఆ తర్వాత సాధారణ వాయిస్ కాల్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తకపోయేసరికి మళ్ళీ ఫ్లాట్‌కి వచ్చిన రాజీవ్ శిరీష ఉన్న రూం తలుపుని గట్టిగా పలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఫ్యానుకి చున్నీతో ఉరేసుకొని ఉన్న శిరీష కనిపించింది. అయితే శిరీషను ఆ స్థితిలో చూసిన రాజీవ్ మొదట శ్రావణ్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి వెంటనే తిరిగిరావాలని చెప్పాడు.

అదే సమయంలో శ్రావణ్ రావడం ఆలస్యమయ్యే సరికి మరోసారి ఫోన్ ట్రై చేసిన తర్వాత డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ వెళ్ళి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్‌ను తీసుకొచ్చేటప్పటికే ఆమె చనిపోయి కనిపించింది. ఆ తర్వాత పోలీసులు శిరీష ఆత్మహత్య కేసుగా విచారణ మొదలుపెట్టి ఆమె భర్త సతీష్‌చంద్రకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకొనేంత పిరికిదికాదని అనుమానం వ్యక్తం చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు విచారణను హత్య యాంగిల్‌లో చేపట్టారు.

13వ తేదీ ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తన బ్యాచ్‌మేట్ హరీందర్‌కు ఫోన్ చేసి శిరీష మృతికి సంబంధించిన విషయాన్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత విచారణలో భాగంగా రాజీవ్‌ని విచారించిన పోలీసులు 13తేదీ సాయంత్రం శ్రావణ్‌ను విచారించిన పోలీసులు ఈ కేసులో కొత్తకోణం ఉన్నట్లుగా కనుక్కొన్నారు. ఆ తర్వాత 13తేదీ ఉదయం 10గంటల ప్రాంతంలో ఎస్‌ఐ హరీందర్‌కు ఫోన్‌ చేసిన ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి వాళ్ళు ముగ్గురూ కుకునూరుపల్లికి వచ్చి మందు తాగారనే విషయం విచారణలో బయటికి వచ్చిందని చెప్పగానే ఫోన్ కట్ చేసారు.

ఆ తర్వాత ఉదయం 11గంటల 30 నిమిషాల ప్రాంతంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఎస్ఐ ప్రబాకర్‌రెడ్డి తన క్వార్టర్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, అంతేగాక శిరీషకు సంబంధించిన ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి స్పష్టంచేశారు.

ఈ కేసులో ఎ1గా శ్రావణ్, ఎ2గా రాజీవ్‌లపై  304బి, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

The post చిక్కుముడి వీడిన ‘డెత్ సీక్రెట్స్’ appeared first on .This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

చిక్కుముడి వీడిన ‘డెత్ సీక్రెట్స్’

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×