Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నటుడు ప్రదీప్ ఆత్మహత్య విషయంలో ‘మీడియా ఓవరాక్షన్’

జర్నలిస్టులంటే ఇన్నాళ్ళూ జనాల్లో ఓ మాదిరి గౌరవం ఉండేది. ఒక జర్నలిస్టుని మహాజ్ఞానిలా చాలా బాగా చూసేవాళ్ళు. అయితే రాను రాను మీడియాలో కొందరు ముఖ్యంగా యాంకర్లు రిపోర్టర్లుగా మారి మీడియా పరువు తీసే పనిలో ఉన్నారు. ఏదైనా న్యూస్ కవరేజ్‌కు సంబంధించి జర్నలిస్టు అక్కడి వచ్చారంటే ఘటన జరిగిన విషయాలను, అక్కడి పరిస్థితులను అక్కడ ఉన్నవాళ్ళను అడిగి తెలుసుకోవడం అనేది కామన్‌గా జరిగేదే. అయితే ఈమధ్య ఫీల్డ్ రిపోర్టింగ్ పేరుతో స్టూడియోలో కూర్చొనే యాంకర్లకు మైకులిచ్చి సంఘటనా స్థలానికి పంపించి అక్కడి నుండి లైవ్‌లు ఇప్పించే సంస్క‌ృతి మొదలైన తర్వాత పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

ఎవరైనా హైపర్ యాక్టివ్‌గా ఉండే రిపోర్టర్లు మినహా ఎవరూ తమ పరిధిదాటి ఎదుటివాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫీల్డ్‌లో పనిచేయరు. శాస్త్రం తెలిసినోడికి తెలియనోడికి ఎంత తేడా ఉంటుందో రెగ్యులర్‌గా రిపోర్టింగ్ చేసే వాళ్ళకి అమావాస్యకొకసారి ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు సినిమాల్లో చూపించినట్లు మైక్ పట్టుకొని తమకు తెలిసిందే మహాగ్రంధమన్నట్లుగా వ్యవహరించే యాంకర్లు మొత్తం మీడియా పరువు చంకనాకిస్తున్నారు. ఇలాంటి యాంకర్లు రిపోర్టింగ్‌కు వచ్చి సమాజంలో మీడియా అంటేనే జనాలు ఛీదరించుకొనే పరిస్థితికి తీసుకొస్తున్నారు.

ఈరోజు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య తర్వాత ఆయన భార్య పావని ఇంటికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల్లో కొంతమంది చేసిన ఓవరాక్షన్ ఎంతో నీఛంగా అనిపించింది. ఓ మనిషి చనిపోయిన బాధలో ఉన్న ఇంటికి వెళ్ళి అతి దారుణంగా వాళ్ళ ఇంట్లోకి జొరబడడమే కాకుండా మీరెందుకు మాట్లాడరని గదమాయించడం, బయటికి వెళ్ళండని ఎంత చెప్పినా, తలుపులు మూసేస్తున్నా ఏదో యాంగ్జైటీ క్రియేట్ చేస్తున్నామనుకొని కనీస ఇంగిత జ్ఞానంలేకుండా వ్యవహరించిన తీరు టీవీ చూస్తున్న వాళ్ళకే “ఛీ మీడియా వాళ్ళంటే ఇలా ఉంటారా” అని అసహ్యించుకొనేలా చేసింది.

అంతేగాక భర్త చనిపోయిన మహిళను మీ ఇంట్లో ఉన్న శ్రవణ్ ఎవరు? శ్రవణ్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిన్న రాత్రి ఏం జరిగింది? వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు జనాలు తప్పుగా ఆలోచించే విధంగా పనికిమాలిన సూటిపోటి ప్రశ్నలు వేయడం ఎంత వరకు కరెక్ట్. అంతేకాకుండా అక్కడే ఉన్న శ్రవణ్‌ అనే పావని బంధువుని మీ బర్త్‌డే లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అని అడిగి మీడియా పరువు తీయడం తప్ప కొత్తగా ఉద్ధరించే పనులు ఏమీ చేయలేదు. అది సరిపోదనట్లు ప్రాథమికంగా మనకందుతున్న సమాచారం అంటూ పోలీసులకు కూడా తెలియని చాలా విషయాలు తమకు మాత్రమే తెలుసన్నట్లు ఏదో కేసు ఇన్వెస్టిగేషన్‌ తామే చేస్తున్నట్లు వ్యవహరించే తీరు ఎంతో జుగుప్సాకరంగా ఉంది. అన్నింటికి మించి వాళ్ళ ఇంట్లోకి జొరబడడమేకాకుండా బయటికి వెళ్ళమన్నందుకు వాళ్ళతోనే గొడవేసుకొనే మీడియా మేధావుల వల్ల సమాజంలో మొత్తం మీడియాకు ఏమాత్రం మంచి జరుగకపోగా ఉన్న పేరు పోయి జనాలు అసహ్యించుకొనే స్థితికి తీసుకొస్తున్నారు.

ఏది ఏమైనా విషయం ఏదైనప్పటికీ ఒకరికి ఇష్టంలేకుండా వారి వ్యక్తిగత జీవితంలోకి బలవంతగా వెళ్ళి… ఇబ్బందిపెట్టి లైవ్‌లో చాలా బాగా చెప్పావని బాస్‌నుండి మంచి మార్కులు కొట్టేయాలనే తహతహలాడే గుణం, ఆలోచనా విధానం మార్చుకోకపోతే….. ఇన్నాళ్ళు మీడియా వాళ్ళంటే ఎంతో గౌరవించిన జనాలు, మీడియా వాళ్ళొచ్చారురా అంటూ రాళ్ళతో కొట్టే రోజులు దూరంలో లేవు.

The post నటుడు ప్రదీప్ ఆత్మహత్య విషయంలో ‘మీడియా ఓవరాక్షన్’ appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

నటుడు ప్రదీప్ ఆత్మహత్య విషయంలో ‘మీడియా ఓవరాక్షన్’

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×