Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జంధ్యాల భార్య నన్ను తిట్టలేదు: బ్రహ్మానందం

ఇటీవల, మీలో ఎవరు కోటీశ్వరుడు (M.E.K) ప్రోగ్రామ్ లో ప్రముఖ దర్శకుడు జంధ్యాలపై బ్రహ్మానందం, చిరంజీవి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకున్నారనే అంశం సర్వత్రా హాట్ టాపిక్ గా మారిందన్న విషయం అందరికి తెలిసిందే.

జంధ్యాల వ్యక్తిగత అభిరుచులు, జీవితంపై పబ్లిక్ గా నోటికి వచ్చినట్టు మాట్లాడుకునే అర్హత ఎవరికీ లేదని, వాళ్ళందరినీ కోర్టుకు ఈడుస్తానని జంధ్యాల సతీమణి ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు నేడు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆమె అంతటితో ఆగక, చిరంజీవిని, బ్రహ్మానందంలకు ఫోన్ చేసి నానా తిట్లు తిట్టారని, వారు క్షమాపణలు కూడా చెప్పారని కథనాలు వచ్చాయి.

ఐతే!  ఇదంతా ఉత్తిదేనని, జంధ్యాల సతీమణి తమకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, తాము క్షమాపణలు చెప్పడం అస్సలు జరగలేదని, ఇదంతా మీడియా సృష్టేనని బ్రహ్మానందం తన ఆత్మీయ వర్గాలతో అన్నట్టు విశ్వసనీయ సమాచారం. “అసలు కోర్టులకు వెళ్ళడమేంటి? సినిమా వాళ్ళపైన, సెలబ్రిటీలపైన అర్ధం పర్ధం లేని అసత్యాలు ప్రచారం చేసి, పండగ చేసుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందని“ బ్రహ్మానందం వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బతికున్న వేణుమాధవ్ చచ్చిపోయాడనే వార్తలు సృష్టించిన నేటి మీడియా వాతావరణంలో నాపైన, చిరంజీవి పైన ఇటువంటి వార్తలు రావడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని ఆయన అంటున్నారు.

ఎప్పటికీ జంధ్యాల నా గురువేనని, ఆ కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉందని, జంధ్యాల సతీమణి తనకు గురుపత్ని అని, వారికి మాపై ఉండే వాత్సల్యం ఇసుమంతైనా తగ్గలేదని బ్రహ్మానందం సన్నిహితులతో అన్నార తెలిసింది.

ఏది ఎలా ఉన్నా, మీలో ఎవరు కోటీశ్వరుడు (M.E.K) ప్రోగ్రామ్ నిశితంగా చూస్తే? అందరికీ అర్ధమవుతుందని, మనం చేసే కామెడీ ఇతరులకు ట్రాజెడీ కాకూడదని సినిమా పెద్దలు సూచిస్తున్నారు.

-స్వాతి

The post జంధ్యాల భార్య నన్ను తిట్టలేదు: బ్రహ్మానందం appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

జంధ్యాల భార్య నన్ను తిట్టలేదు: బ్రహ్మానందం

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×