Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ ‘సినీమహల్’

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వ‌హించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. అలీరాజా, సోహెల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుది.
నిర్మాత పార్థు మాట్లాడుతూ – “మా సినీ మ‌హ‌ల్ చిత్రం ఈ మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. సంథింగ్ స్పెష‌ల్ స‌బ్జెక్ట్‌గా సినిమా చ‌క్క‌గా రూపొందింది. ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. శేఖ‌ర్ చంద్ర‌గారి సంగీతం, దొరై కె.సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్ అవుతాయి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హ‌కారంతో ఓ మంచి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ వ‌ర్మ మాట్లాడుతూ – “నిర్మాత‌ల స‌హ‌కారంతో పాటు న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో అనుకున్న విధంగా ఓ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. మార్చి 31న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది“ అన్నారు.
అలీ రాజా మాట్లాడుతూ – “సినీ మ‌హ‌ల్‌లో మంచి క్యారెక్ట‌ర్ చేశాను. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ‌వర్మ‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మార్చి 31న విడుద‌ల‌వుతున్న సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ – “విబిన్న‌మైన క‌థాంశంతో రూపొందిన చిత్రం సినీ మ‌హ‌ల్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. మార్చి 31న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

The post డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ ‘సినీమహల్’ appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ ‘సినీమహల్’

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×