Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వైశాఖం ఆడియో విడుదలచేసిన మహేశ్‌బాబు

Hero Mahesh-babu-released-director-b-jaya-latest-movie-vaisakhams-audio

‘ప్రేమలో పావని కళ్యాణ్‌’, ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వైశాఖం’. హరీష్‌, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి డి.జె. వసంత్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు మహేష్‌ ముఖ్య అతిథిగా, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్‌, మైత్రి మూవీస్‌ అధినేత వై. రవిశంకర్‌ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.  ‘వైశాఖం’ ఆడియో సీడీని సూపర్‌స్టార్‌ మహేష్‌ రిలీజ్‌ చేసి తొలి సీడీని స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి అందించారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు గారు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ‘వైశాఖం’ పాటలు, విజువల్స్‌ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్‌, అవంతిక, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్దహిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – ”ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్‌గా జరిగింది అంటే మహేష్‌బాబు గారే కారణం. షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్‌ థాంక్స్‌ చెబుతున్నాను. ఆయన హ్యాండ్‌ గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్‌ చేశాం. ఆరూ హిట్‌ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్‌ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్‌” అన్నారు.

స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘వైశాఖం’లాంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటూ జయ గారికి, రాజుగారికి నా అభినందనలు తెలియచేస్తున్నాను’ అన్నారు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”భానుమతి, విజయనిర్మల గారి తర్వాత మహిళా దర్శకుల్లో జయగారే. రాజుగారు, జయగారు ప్యాషన్‌తో సినిమాలు తీస్తారు. హరీష్‌, అవంతికలతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ‘వైశాఖం’ బిగ్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.

డైరెక్టర్‌ జయ బి మాట్లాడుతూ ‘ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబే కారణం. రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఆయన వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది.  మహేష్‌బాబు, మురుగదాస్‌ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాపై ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలుసు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి టోటల్‌ ఇండియా రికార్డ్స్‌ అన్నీ క్రాస్‌ చేసి చాలా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నాకున్న కోరికల్లో నా ఫస్ట్‌ కోరిక అది. తర్వాతే మా ‘వైశాఖం’. నాకు చాలా చాలా ఇష్టమైన రైటర్‌ త్రివిక్రమ్‌ గారు. ఆయన సినిమాలు సాధారణంగా 2, 3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్‌గా చూస్తాను, రెండు ఆయన డైలాగ్స్‌ కోసం. మూడు ఆయన డైలాగ్స్‌ పేర్చిన విధానం, ఆ సినిమా తీసే టెక్నిక్‌ పట్టుకోవాలని చూస్తాను. మా రైటర్స్‌ని త్రివిక్రమ్‌ గారిలా ఒక్క డైలాగ్‌ అన్నా రాయండని చెప్తుంటాను. అది మా వల్లకాలేదు. ‘వైశాఖం’లో కూడా ట్రై చేశాం. సినిమా చూస్తే అందరికీ అర్ధం అవుతుంది. ఎక్కడ ట్రై చేశామో. మేము ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం. త్రివిక్రమ్‌ గారు మాత్రం ఇంకా హైట్స్‌కి వెళ్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ రైటర్‌ ఆయన. అలాగే వంశీ పైడిపల్లి అంటే ఫస్ట్‌ నుండి నాకు ఇష్టం. ముఖ్యంగా ‘ద ఇన్‌టచ్‌బుల్‌’ ఇంగ్లీషు సినిమాని నేను చాలాసార్లు చూశాను. ఆ సినిమాని వంశీ ఎలా తీయగలడు, ఎలా మౌల్డ్‌ చేయగలడు అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా ‘ఊపిరి’ చిత్రాన్ని తీశారు వంశీ పైడిపల్లి. టాప్‌ లెవల్‌లో ఆయన టాలెంట్‌ని చూపించారు. ఆయన నెక్ట్స్‌ సినిమా ఇంకా టాప్‌ లెవల్‌లో ఉంటుందని మహేష్‌బాబుగారు చెప్తున్నారు. ఆ సినిమా త్వరలోనే చూస్తాం. డి.జె. వసంత్‌తో చాలా డిఫరెంట్‌గా సాంగ్స్‌ చేయించాననే నమ్మకం నాకుంది. సుబ్బారావుని ఈ సినిమా ద్వారా కెమెరామెన్‌గా ఇంట్రడ్యూస్‌ చేశాం. స్టార్టింగ్‌ నుండి డిఐ వరకు ఏదీ వదలకుండా కమిటెడ్‌గా, చాలా డెడికేటెడ్‌గా వర్క్‌చేస్తారు. హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతిక ఇద్దరూ కొత్తవాళ్లే. వాళ్లతో శేఖర్‌ మాస్టర్‌ మంచి డాన్స్‌ చేయించారు. యాక్టింగ్‌వైజ్‌గా ఎమోషనల్‌ సీన్స్‌లో చాలా బాగా నటించారు. నేను ఎలాగైతే రావాలనుకున్నానో అలాగే చేశారు.’ అన్నారు.

హీరో హరీష్‌ మాట్లాడుతూ – ”నాలాంటి కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడానికి సూపర్‌స్టార్‌ మహేష్‌గారు రావడం చాలా ఆనందంగా ఉంది. నా వెన్నుతట్టి ‘వైశాఖం’తో హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్న జయగారికి, రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శేఖర్‌ మాస్టర్‌ అన్ని పాటలకి మంచి కొరియోగ్రఫి కంపోజ్‌ చేశారు. పెద్ద హీరోలకి చేసినట్లుగానే మంచి సాంగ్స్‌ ఇచ్చారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

  •  

The post వైశాఖం ఆడియో విడుదలచేసిన మహేశ్‌బాబు appeared first on .This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

వైశాఖం ఆడియో విడుదలచేసిన మహేశ్‌బాబు

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×