Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘కాటమరాయుడు’ కుమ్మేస్తాడట: సెన్సార్ రిపోర్ట్

ఇప్పుడు అందరి కళ్ళూ ఆయనపైనే…. అటు జనసేన సమావేశమైనా ఇటు కాటమరాయుడు ప్రమోషనైనా అన్నింటికీ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్నది మాత్రం పవన్‌కళ్యాణ్. ఇండస్ట్రీలో అందరూ ఇష్టంగా పవర్ స్టార్ అని పిలుచుకొనే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు ఎలా ఉండబోతోంది? ప్రేక్షకుల సంగతి పక్కనబెడితే మొదట సెన్సార్‌వాళ్ళేమనుకుంటున్నారన్న దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సమ్మర్ సీజన్‌కి బాహుబలి2 సినిమాకంటే నెలరోజుల ముందు వస్తున్న కాటమరాయుడు సెన్సార్‌కు వెళ్ళింది. అయితే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కాటమరాయుడు సినిమాకి ‘యు’ సర్టిఫికెట్ జారీచేశారు.

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్‌బ్యానర్‌పై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించగా కిశోర్‌కుమార్ పార్థసాని డైరెక్ట్ చేశారు. పవన్‌కళ్యాణ్‌కు జంటగా శృతిహాసన్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఈమధ్యే పూర్తిచేసుకుంది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన కాటమరాయుడు సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న కాటమరాయుడు సెన్సార్ టాక్ చాలా పాజిటివ్‌గా ఉందని తెలుస్తోంది. అయితే సెన్సార్‌కి వెళ్ళేముందు  వరకూ కాటమరాయుడులో ఉన్అంన యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగా ఖచ్చితంగా ఎ సర్టిఫికెట్ కానీ యు/ ఎ సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నారు. అయితే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా యు సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తానికి సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న కాటమరాయుడు ఈనెల 18న శిల్పకళావేదికలో అట్టహాసంగా ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను జరుపుకోనుంది. అంతేగాక  ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ అన్నీ మంచి ఆదరణ దక్కించుకోవడం,  ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచేలా ప్రమోషన్లు, పబ్లిసిటీ పనిలో బిజీగా ఉంది కాటమరాయుడు టీం.

  •  

The post ‘కాటమరాయుడు’ కుమ్మేస్తాడట: సెన్సార్ రిపోర్ట్ appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

‘కాటమరాయుడు’ కుమ్మేస్తాడట: సెన్సార్ రిపోర్ట్

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×