Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Yuvagalam Pursuit of Perfection in Anantapur

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర తంబళ్లపల్లిలో అడుగడుగునా ఘనస్వాగతం

తంబళ్లపల్లి: తంబళ్లపల్లి నియోజకవర్గంలో యువనేత Nara Lokesh పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 44వరోజు యువగళం పాదయాత్ర గురువారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. తొలుత అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి యువనేత నీరాజనాలు అర్పించారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగారు.  నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను నిరుత్సాహపర్చకుండా ఆప్యాయంగా పలకరిస్తూ  సెల్ఫీ ఇచ్చారు. రంగసముద్రం చేరుకున్న లోకేష్ కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకున్నారు. పెద్దతిప్పసముద్రంలోని శ్రీకృష్ణదేవరాయలు సెంటర్లో స్థానిక ప్రజలు, కార్యకర్తలు రహదారులంతా పూలతో నింపి యువనేతకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా మోత, డప్పుల దరువుతో జై బాబు.. జై లోకేష్ అనే నినాదాలతో పెద్దతిప్ప సముద్రం హోరెత్తింది. అక్కడి నుండి మద్దయ్యగారిపల్లె మీదుగా కొమ్మరపల్లి విడిది కేంద్రానికి చేరుకుంది.

పాదయాత్రలో వ్యక్తమైన అభిప్రాయాలు:

టమోటా సాగుచేస్తే రూ.15లక్షల నష్టం వచ్చింది -రమణారెడ్డి, పెద్దతిప్ప సముద్రం, బొంతలవారిపల్లి

ప్రస్తుతం మూడెకరాలలో దోస సాగుచేశాను. ఇప్పటికే రెండు లక్షల పెట్టుబడి కాగా మొదటి కాపు కోశాము. మార్కెట్లో అంతగా మద్దతు ధర లేదు. దోస పంటకు ముందు ఐదెకరాలలో టమోటా సాగు చేశాను. మూడు దఫాల్లో టమోటా సాగు చేసినందుకు రూ.15 లక్షల నష్టం వచ్చింది. ఒకసారైనా మద్దతు ధర పలికి లాభం వస్తుందన్న ఆశతో మూడుదఫాలు సాగుచేసిన నష్టాలే మిగిలాయి.

దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేదు -దొరిగుంట్ల సురేంద్ర, వికలాంగుడు, పెద్దతిప్పసముద్రం

వికలాంగులకు ఈ ప్రభుత్వంలో కనీసం సంక్షేమ పథకాలు సరిగా రావడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేదు. గత ప్రభుత్వంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటర్లు ఇచ్చే వారు. ఇప్పుడు అవేమీలేవు. టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులను ఆదుకోవాలి.

బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డు తొలగించారు! -రమణారెడ్డి, బోర్లపల్లికి చెందిన రైతు.

నేను చిన్నపాటి కోళ్లఫారం పెట్టుకున్నాను. కోళ్లు పొదిగిన సమయంలో కరెంట్ బిల్లు నెలకు రూ.3 వేలు వస్తోంది. దాన్ని సాకుగా చూపించి నా రేషన్ కార్డు తొలగించారు. సాధారణ సమయంలో బిల్లు రూ.600 మాత్రమే వస్తోంది. స్వయం ఉపాధి కోసం కోళ్ల పెంచుకోవడం తప్పా? నా రేషన్ కార్డు తిరిగి మంజూరు చేయాలి.

ఆర్థిక ఉగ్రవాదిని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా? కమిషన్ల కోసం ఉన్నవాటిని తరిమేసి సమ్మిట్ పేరుతో నాటకాలు చిత్తూరు జిల్లాను అడ్డంగా దోచేస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం తంబళ్లపల్లిలో రాజ్యం నడుస్తోంది పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి…. ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది! యువతతో ముఖాముఖిలో నిప్పులు చెరిగిన యువనేత లోకేష్

తంబళ్లపల్లి: కోడి గుడ్డు కథలు చెప్పే మంత్రిని చూసి ఎవరు వస్తారని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు.  జగన్ పాలన లో వచ్చిన ఒక్క పరిశ్రమ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నా. టిడిపి తెచ్చిన కంపెనీలకి రిబ్బన్ కటింగ్ చెయ్యడం తప్ప మీరు తెచ్చిన కంపెనీ ఒక్కటి అయినా ఉందా అని లోకేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం మద్దయ్యగారిపల్లిలోని శ్రీవిజయగణపతి ఫంక్షన్ హాలులో యువతీయువకులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… వైసిపి పాలనలో ఎక్కువ నష్టపోయింది ఏపి యువతే.  నాలుగేళ్లు ఇంట్లో పడుకొని ఇప్పుడు సమ్మిట్ అంటూ నాటకాలు ఆడుతున్నారు. పెద్ద కంపెనీలు అన్ని వీళ్ళ బెదిరింపులకు భయపడి ఏపి కి బై బై చెప్పేశాయి. రాయలసీమ కి రావాల్సిన రిలయన్స్ వెళ్ళిపోయింది. అమరరాజా కంపెనీ తెలంగాణ కు వెళ్ళిపోయింది. మేం  పాక్స్ కాన్ ను చిత్తూరు జిల్లాకు తెస్తే లక్ష ఉద్యోగాలిచ్చే యూనిట్ ను ఆ సంస్థ తెలంగాణాకి తరలించేసింది.  టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు, 40 వేల కంపెనీలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అంగీకరించింది. ఉడ్తా పంజాబ్ చూశాం ఇప్పుడు ఉడ్తా ఏపి చూస్తున్నాం. అనంతపురం కి కియా వస్తుంది అని ఎవరైనా ఊహించారా?

2025లో జాబ్ క్యాలెండర్ ఇస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చాక 2025 జనవరిలో జాబ్ కేలండర్ తీసుకొస్తాం..ఆ బాధ్యత నేనే తీసుకుంటా. లోన్లు, సబ్సీడీలు అందించి స్వయం ఉపాధిని మేము కల్పిస్తాం. పక్క రాష్ట్రాల్లో జాబ్ లు చేయాలని ఆలోచించడం కాదు. మీరే ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలి. మేము సిద్ధంగా ఉన్నాం..మీకు అండగా ఉంటాం..పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. యువత ను టిడిపి లో రాజకీయంగా ప్రోత్సహిస్తాం. టిడిపి వేసిన సిసి రోడ్ల మీద వైసిపి వాళ్ళు గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారు. నేను తెచ్చిన కంపెనీలు ఇవి…మేము పూర్తి చేసిన  ప్రాజెక్టుల గురించి చెప్పి పెద్ది రెడ్డి కుటుంబానికి ఛాలెంజ్ చేశాను. మూడు సార్లు ఎంపి ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక్క కంపెనీ తీసుకొచ్చాను, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాను అని చెప్పగలిగాడా? అధికారుల పై ఒత్తిడి తెచ్చి నాకు నోటీసులు ఇచ్చి జిల్లా నుండి పంపించి ఛాలెంజ్ కి వచ్చానని ఎంపీ గొప్పలు చెప్పుకున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పట్ల ఆసక్తి ఉన్న యువత ను ప్రోత్సహిస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తాం. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు… యువత కష్టపడితేనే విజయం సాధిస్తారు.

ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం

వైసిపి పాలనలో 190 డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు నాలుగేళ్లలో మూతబడ్డాయి. విదేశీ విద్యను రద్దు చేశాడు.. సీఎం కూతుర్లు విదేశాల్లో చదవొచ్చు…కానీ పేదల పిల్లలు చదవకూడదా? ఎన్నికల ముందు జగన్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు.  అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా దీవెన, వసతి దీవెన అంటూ మోసం చేశారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లించి తల్లితండ్రులు పై ఎటువంటి భారం లేకుండా చేసాం. ఇప్పుడు అరకొరగా డబ్బులు వేసి తల్లితండ్రుల పై సుమారుగా లక్ష రూపాయిలు భారం పడేలా చేశారు. ఫీజులు కడితే కానీ పిల్లలకు హల్ టికెట్, సర్టిఫికేట్లు రాని పరిస్థితి. టిడిపి గెలిచిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారు. జీఓ 77 ద్వారా పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు.

ఎంపి మిథున్ ఏం చేస్తున్నారు?

తంబళ్లపల్లిలో ఉద్యోగాలు రావాలంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించాల్సిందే. ఆ ఒక్క కటుంబం వల్లే పుంగనూరు, తంబళ్లపల్లికి పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడులు పెట్టేవారిన వాటాలు అడగబట్టే పరిశ్రమలు పెట్టడం లేదు.  పార్లమెంట్ లో ఎంపి మిథున్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఒక్క కంపెనీ అయినా తెచ్చారా? వాళ్ళ సొంత కంపెనీ అభివృద్ది తప్ప ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇప్పించలేదు. ఎంపీగా ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా.? కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా అడగడం లేదు. అలాంటి వారి వల్లే మన ప్రాంతం వెనకబడింది. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అని ఊదరగొట్టారు..32 మంది ఎంపీలున్నారు..ఏం పీకుతున్నారు.? చిత్తూరు జిల్లా అభివృద్ధి గురించి సవాల్  చేస్తే నోరు మెదపడం లేదు.

పెద్దిరెడ్డి కుటుంబమే తంబళ్లపల్లికి శాపం!

 తంబళ్లపల్లిలో పరిశ్రమలు రాకపోవడానికి, ఇంత మంది నిరుద్యోగులు ఉండటానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబం. పాలు, పల్పీ, మామిడి వ్యాపారం కూడా వాళ్లే  చేస్తున్నారు. పెద్దిరెడ్డి మంత్రయ్యాక సొంత నియోజకవర్గంలో నేను కేటాయించిన డబ్బులతో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. తంబళ్లపల్లిలో రాజ్యం నడుస్తోంది. పాదయాత్ర చేస్తుంటే రాళ్లదాడికి యత్నిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే మనం మాట్లాడుతున్నాము. టిడిపి వచ్చాక ఈ ఐదేళ్లలో పెట్టిన దొంగ కేసులును బయటపెట్టి జ్యుడిషియల్ విచారణ వేసి, శిక్షిస్తాం. ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా 60వేల మెజారిటీతో గెలిచారు.. బి.కొత్తకోటకు మంజూరు చేసిన డిగ్రీ కాలేజీని కట్టించలేని చేతకాని ఈ ఎమ్మెల్యే. కనీసం గత ప్రభుత్వం కేటాయించిన డిగ్రీ కళాశాల పూర్తి చేయలేని పరిస్తితి. టిడిపి వచ్చిన మొదటి ఏడాదిలోనే బి . కొత్త కోట లో డిగ్రీ కళాశాల పూర్తి చేస్తాం.  పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడిస్తే ఇక్కడికి పరిశ్రమలు తెస్తా..ఆ బాధ్యత నేను తీసుకుంటా..అవసరమైతే నా మాటల్ని రికార్డు చేసుకోండి.

యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రాధాకృష్ణ, బికొత్తకోట: బి.కొత్తకోటలో గత ప్రభుత్వం డిగ్రీకాలేజీని మంజూరు చేసి, నిధులు కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టలేదు. మీరు వచ్చాక డిగ్రీ కాలేజీని నిర్మించండి.

రమేష్, పెద్దపల్లి: గత ప్రభుత్వంలో నిరుధ్యోగ భృతి ఇచ్చారా.? మీరొచ్చాక మళ్లీ భృతి ఇచ్చి, ఉద్యోగాలు కల్పించండి.

శ్రీకాంత్: నేను బి.టెక్ చదవా..ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ ఐటీ హబ్ గా మార్చించి చంద్రబాబే. తంబళ్లపల్లి కూడా పరిశ్రమలు తీసుకురండి.

సుదర్శన్ రెడ్డి : మాది వ్యవసాయ కుటుంబం. నేను బీటెక్ చదివా. వ్యవసాయంపై మక్కువతోనే ఉద్యోగం చేయకుండా వ్యవసాయమే చేస్తున్నా. కానీ మద్ధతు ధర పంటలకు ఉండటం లేదు. పండిన పంటలు విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు కల్పించాలి.

సురేష్ యాదవ్: తమిళనాడులో చాలా మంది యువత వ్యవసాయం చేస్తారు..కానీ ఇక్కడి వాళ్లు బెంగళూరు,  చెన్నై వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడిస్తాం..మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురండి.

సురేంద్ర: TDP హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను తంబళ్లపల్లిలో తొలగించారు. అన్న క్యాంటీన్ తొలగించడం వల్ల కార్మికులు, పని చేసుకుని బతికేవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. తంబళ్లపల్లిలో అన్నా క్యాంటీన్ తొలగించి సచివాలయం పెట్టారు. మీరొచ్చాక మళ్లీ అన్నా క్యాంటీన్ తెరిపించండి.

పవన్, ఆరేడుపల్లి : ఇక్కడ క్రీడల్లో యువత వెనకబడ్డారు. మీరొచ్చాక క్రీడలను ప్రోత్సహించండి.

రవి : రాజకీయంగా, పారిశ్రామికంగా ఎదిగే యువతకు భరోసా ఇవ్వండి. తరలిపోయిన పరిశ్రమలు మళ్లీ తీసుకురండి.

యువనేతను కలిసిన బుడుగ జంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు

బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ క్యాంప్ సైట్ లో  శ్రీ వెంకటేశ్వర బుడుగజంగ సంక్షేమ సంఘ నాయకులు యువనేతను కలసి సమస్యలను విన్నవించారు. చిరువ్యాపారాలు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్న మేం దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. బుడుగ, బేడ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై 2018లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జెసి శర్మ నేతృత్వాన ఏక సభ్య కమిషన్ అధ్యయనం చేసి నివేదిక కూడా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో జరిగిన బహిరంగసభలో అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అవుతున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని ఎస్సీల జాబితాలో చేర్చి న్యాయం చేయాలి.

*నారా లోకేష్ మాట్లాడుతూ….*

ఓట్లకోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మాటతప్పి మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డి నైజం. బుడుగ, బేడజంగాల సమస్యపై అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి న్యాయం చేస్తాం. బుడుగ, బేడజంగాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తాం. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

Also, read this blog: Stepping Up Our Pursuit of Perfection in Yuvagalam

Tagged: #LokeshPadaYatra#Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

The post Yuvagalam Pursuit of Perfection in Anantapur appeared first on TDP.



This post first appeared on Great Honors And Recognition For N. Chandrababu Naidu Achievements, please read the originial post: here

Share the post

Yuvagalam Pursuit of Perfection in Anantapur

×

Subscribe to Great Honors And Recognition For N. Chandrababu Naidu Achievements

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×