Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

"నారీ నారీ నడుమ మురారి" లా 15 రోజులు ఇల్ల్లా లుతో, 15 రోజులు ప్రియురాలితో గడపమని మొగుణ్ణి ఆదేశించిన లోక్ అదాలత్!

                         అబ్బ! సహజీవనం నేరమూ కాదు,పాపమూ కాదు అని ఈ  దేశ అత్యున్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పు ఆదారంగా ఒక మొగుడు గృహ హింస చట్టం నుండి విముక్తుడై, ఎంచక్కా, 15 రోజులు బార్యతోను, 15 రోజులు గర్ల్ ప్రెండ్ తోను సంసార జీవితం గడపడానికి కోర్టు అనుమతి పొందాడు. వివరాల లోకి వెళితే

  మద్య ప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పట్టణం లో బసంత్ అనే అతను  ఎలక్టర్సిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. అతనికి బార్యా పిల్లలు ఉన్నారు. 10 యేండ్ల క్రితం బార్య ఒంట్లో బాగో లేదని ఒక ఆవిడను తెచ్చి పనికి కుదిర్చాడు. ఎలాగో భార్యకు ఒంట్లో బాగో లేదు కాబట్టి, ఆవిడగారి బాగోగులుతో పాటూ, ఈయనగారి బాగోగులను చూడడం మొదలు పెట్టి , ఇంట్లో ఇల్లాలు పని , పడకటింట్లో ప్రియురాలు పనికి అంకితం అయింది. ఆ తర్వాత బార్యకు ఆరోగ్యం కుదుట పడినా ఈవిడను పనిలోనుంచి తీయలేదు సరికదా , ప్రియురాలు ఉద్యోగం పర్మనెంట్ అయింది. పాపం ఆ పిచ్చి ఇల్లాలు రెండేళ్ళ క్రితం కోర్టులో భర్త మీద కేసు పెట్టింది. ఆ కేసు సారాంశం ఏమిటంటే తన భర్త తనతో గడపకుండా తన ప్రియురాలితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు అని, కాబట్టి తనతో కూడా  గడిపేలా ఆదేశాలు ఇప్పించమని కోరింది. దాని మీద స్పందించిన కోర్టు, చట్ట ప్రకారం బార్య ఉండగా వేరొక ఆవిడతో సహజీవనం చెయ్యడం నేరమని చెప్పి, గృహ హింస చట్టం క్రింద బసంత్ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి విచారణ చేపట్టింది.

  కానీ మొన్న ఒక కేసులో సుప్రీం కోర్టు వారు సహజీవనం నేరం కాదు, పాపం కాదు అని చెప్పిన దానిని మీడియా వాళ్ళు గొప్పగా పోకస్ చేసే సరికి దానిని బసంత్ తరపు న్యాయవాది జడ్జ్ గారికి చూపించి ,తమ క్లైంట్ లు ఒక అంగీకారనికి వచ్చారని,సహజీవనం నేరమూ కాదు, పాపమూ కాదని స్వయంగా సుప్రీం కోర్టు వారే అన్నారు కాబట్టి కేసును లోక్ అదాలత్ లో పెట్టి పరిష్కరించాలని కోరగా , సరే అన్నారట జడ్జ్ గారు. మొన్న శనివారమే కేసు పరిష్కరించారు . దాని ప్రకారం
 
 (1). బసంత్ ఉన్న 3 గదుల ఇంట్లో బసంత్ కి మద్య రూం ను, బార్య ఒక పక్క రూంని  ,ప్రియురాలు కు ఇంకొక పక్క రూం ని కేటాయించారు.
(2)నెలలో . 15 రోజులు బార్యతోను, 15 రోజులు ప్రియురాలు తోను బసంత్ గడపాలి . అంటే 15 రోజులు బార్య ప్రక్క రూం తెరిస్తే , ప్రియురాలి రోం కు ఉన్న తలుపును మూసి వేయాలి అన్నమాట. అదే విదంగా తక్కిన 15 రోజుల్లో ప్రియురాలి తలుపు తెరిస్తే , బార్య తలుపు మూసి వేయాలి.
(3). బసంత్ కు ఉన్న స్తిర చరాస్తులు అన్నింటిలో బార్యతో పాటు , ప్రియురాలిక్ సమాన వాటా ఇవ్వాలి.

   ఇలా క్రిమినల్ గా క్రింద బుక్కవలసిన వారు, హాయిగా సుప్రీం కోర్టువారు ఏమి చెప్పారో సరిగా అర్దం చేసుకోకుండా ఆదరా బదరా పరిష్కారాలు చేసినందుకు ప్రియురాలితో చట్టబద్దంగా జీవించే వెసులుబాటు కలిగ్ంది బసంత్ కు. ఇదే విదానం సమాజం లో కోన సాగితే ఏమి లేనొడిని కట్టుకుని ఏడ్చే బదులు , ఉన్నోడిని తగులుకుని హాయిగా జీవించవచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్ర్తే ఏమిటి పరిస్తితి? ఒక్క దానితో జీవితాంతం బోర్ కొట్టే లా కాకుండా ఏదో విదంగా కట్టుకున్న దానిని మాయ చేసి ఇంకొక దానితో చాటు మాటు వ్యవహారం సాగించి , అ తర్వాత ఏదో విదంగా బార్యని కాంప్రమైజ్కి  వచ్చే లా చేస్తే హాయిగా "నారి నారి నడుమ మురారి" లా జివిమ్చావచ్చు అనే తలంపులు మగవాళ్ళలో వస్తే? అలాగే పురుషులకు ఉన్న సౌకర్యం స్త్రీలకు మాత్రం ఎందుకు ఉండరాదు అని రేపు ఉద్యమాలు వస్తే? ఇదంతా ఎక్కడికి దారీ తీస్తుంది? కాబట్టి సుప్రీం కోర్టు వారు తాము ఇచ్చిన తీర్పు మీద ఒక స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది.

 అసలు సుప్రీం కోర్టు వారు ఏమి చెప్పారు అనేది వివరంగా తెలుసుకోవాలంటే ఈ  క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గృహ హింస చట్టం వర్తించేది తాళి కట్టించుకోని బార్యలకు తప్పా, తగులుకున్న తరుణుల(concubine) కు కాదు . 

                                       (Republished Post . 2/12/2013)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

"నారీ నారీ నడుమ మురారి" లా 15 రోజులు ఇల్ల్లా లుతో, 15 రోజులు ప్రియురాలితో గడపమని మొగుణ్ణి ఆదేశించిన లోక్ అదాలత్!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×