Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

                                                                             


                                          వారు హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకునే   విద్యార్దులు . అందరికి ఉన్నట్లే వారిలోను బావాజాలాల  పరంగా బిన్న దృక్పదాలు ఉన్నాయి . ఉండవచ్చు . తప్పేమి కాదు. అయితే అందులో లెప్ట్ వింగ్ విద్యార్దులు అనబడే వారికి  మన భారతీయ సంస్క్రుతి అన్నా , ఆచారాలు అన్నా తగని ఒళ్ళు మంట అనుకుంటా . అందుకే   ఇన్నాళ్ళూ భారత దేశాన్ని ఏలిన పాలకులు "కుహానా లౌకిక వాదులు" కాబట్టి , వారు భారతీయ సంస్క్రుతి పరిరక్షణ అనే దాని మీద పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి , లెప్ట్ వింగ్ విద్యార్దులు ఎంతో స్వెచ్చ గా ఉన్నట్లు ఫీలైపొయి భారతీయ సంస్క్రుతి మీద తమ అక్కసు అంతా వెల్ల గ్రక్కుతూ ఉన్నారు  . వారి ద్రుష్టిలో భారతీయ సంస్క్రుతి అంటె బ్రాహ్మణ సంస్క్రుతి అని , అది భారత దేశం లోని నిమ్న వర్గాలను అణచివేసిందని ,అదీ ఇప్పటికి కొనసాగుతుందని , ఇంకా ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణ అదిపత్యమే కొనసాగుతుందని , "దళిత వాదం" అనే పేరిట ఒక "గలత్  వాదాన్ని " ప్రచారం చేస్తున్నారు  , ఈ దేశం లో ని హిందూ సంస్కృతి మీద దాడి చేసి  తమ మతానికి,  వ్యాపార  సంస్కృతికి అడ్డంగా ఉన్నభారతీయ సంస్కృతిని  నిర్మూలించాలని చూసే   కొన్ని విదేశి శక్తులకు , లెప్ట్ వింగ్ ల భారతీయ సంస్కృతీ వ్యతిరేక ప్రచారం అనుకూలంగా అనిపించటం వలన,  వారికి ఆర్దికంగా , ఇతరత్రా సహాయం చేస్తూ వారిని ప్రోత్సాహిస్తునారు అని విశ్వసనీయ సమాచారం . అయితే దిని గురించి లోతుగా తెలియని అమాయక యువతి యువకులు ఈ లెప్ట్ వింగ్ ల మాయా వాదానికి ఆకర్షితులై తమకు తెలియ కుండానే తమ దెశ సంస్కృతి వ్యతిరేకంగా పోరాడుతున్నారు . ఇది చాలా విషాద కరమైన విషయమ్.

                   హిందూ పురాణాల ప్రకారం చూసినా , ఇప్పుడు నడుస్తున్నది శూద్ర పాలన  యుగమే . స్కంద పురాణమ్ ప్రకారం వైవస్వత మన్వంతరం లో పాతాళానికి తోక్కివేబడిన "బలి చక్రవర్తి", సూర్య సావర్నిక మన్వంతరమ్ లో తిరిగి ఇంద్ర పదవి చెపడతాడని చెప్పబడింది . ఇప్పటి పరిస్తితులు అలాగే ఉన్నాయి. భారత దేశా న్నికి ప్రధాన  మంత్రిగా ఉంది శూద్రుడు అయిన శ్రీ నరేంద్ర మోడి . తెలంగాణా ను ఏలుతున్నది శూద్రుడు అయిన శ్రీ K . చంద్ర శెఖర్ రావు. ఆంద్రాను ఏలుతున్నది కూడా శూద్రుడు అయినా శ్రీ చంద్ర బాబు నాయుడు . మరి విరెవ్వరూ బ్రాహ్మణులు కారు . మరి శూద్రులు పరిపాలించే యుగం లో మద్య యుగాల నాటి  బ్రాహ్మణ అధిపత్యం గురించి "గలత్ వాదం" ఎందుకు? ఇక పోతే ప్రపంచంలో ఎక్కడా ప్రజలని అణచి వేసిన దాఖాలాలు లేనట్లు, అది ఇండియాకే ప్రత్యేక మైనట్లు ప్రచారం చేసి , చేసి ప్రజలకు విసుగు కలిగేలా చెసారు . దానితో ప్రజలు వీళ్ళను పట్టించుకోవడం  మానివేసి , భారతీయ సంస్కృతిని పరిరక్షస్తూ , భారతదేశ అభివృద్దిని కాంక్షించే శ్రీ నరేంద్ర మోడి నాయకత్వం లోని ప్రభుత్వానికి పట్టం కట్టారు . వివక్షత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే . కాకపోతే రూపం వేరు, పేర్లు వేరు అంతే , కొన్ని చోట్ల జాతి , రంగు వివక్షత ఉంటె ఇక్కడ  కుల  వివక్షత ఉంది . దీని ఒక్కటే కారణం  అజ్ణానం  మీద విజ్ఞానం ఎప్పుడూ అధిపత్యం చెలాయిస్తూనే ఉంటుంది . మనిషి జ్ఞాని కానంత కాలం ఎదో ఒక దాస్య శ్రుంఖాలలో  బందీగా ఉండవలసిందే . డబ్బు ఉన్న వాళ్ళంతా స్వెచ్చా జీవులు  అనుకోవడం మూర్కత్వమే . 

            ఇక పొతే  భారత దేశంలో రైట్ వింగ్  బావజాలానికి ప్రాతినిద్యం వహించే B.J.P  పార్టీ కేంద్రం లో అధికారం లోకి రావడం కంటగింపుగా మారిన కొంత మంది లెప్ట్ వింగ్ బావ జాలికులు , అభద్రతా బావంతో , అవకాశం చిక్కినప్పుడల్లా  ఎదో రకంగా  భారతీయ సంస్కృతి మీద దాడి చేయాలనే చూస్తున్నారు . అందులో బాగమే  మొన్న కేరళ మరియు హైదరాబాద్ లో జరిగిన  "ముద్దుల గోల ". రైట్ వింగ్ అంటే పడని అమాయక విద్యార్దులను రెచ్చగొట్టి వారి చేత  తమ సంస్క్రుతి విరుద్దమైన  పరాయి  సంస్క్రుతి పనిని చేయించి శునకానందమ్ పొందడమే " లవ్ టు కిస్" లోని అసలు ఉద్దేశ్యం  .

              ఇదెలా ఉందంటె "ఇంటాయన మీద కోపం తో ఉన్నవారిని పక్కింటాయన్ని ముద్దు పెట్టుకో " అని  చెప్పినట్లు ఉంది . మొన్న హైదరాబాద్ లో  "చుంబన ప్రేమ "  పేరుతో ఒక యువతి పెదాల పై మగ  స్నేహితులు  ఎలా దాడి చేసారో క్రింది విడియో చూస్తె అర్దమవుతుంది . సంస్క్రుతి మీద నిరసన పేరుతో ఈ విదంగా అమాయకంగా లైంగిక దాడులకు గురికావడం తప్పా ఆడపిల్లలకు ఒరిగేది ఏమి లేదు. ఇటువంటి చేష్టలను కఠిన విదానాలతో అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వాల పై ఉంది .

                                                               
                                          (విడియో సరిగా కనపడనిచో ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు)

                                              (Republished Post. OPD 4/11/2014). 


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×