Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

"పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపార

                                                                           


                                     మోసాలు చేసి పెండ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది మగవాళ్ళ పేటెంట్ రైట్ ఏమీ కాదు. అవకాశం చిక్కితే అతివలు అంతకంటె ఘనులే అని నిరూపించే ఎన్నో ఉదంతాలు ప్రస్తుత సమాజం లో కంటున్నాం . వింటున్నాం. అలాంటి మాయలేడి కోవలోకే వస్తుంది వరంగల్ కి చెందిన ఈ మాయలేడి కేసు. కాకపోతే ఇలాంటి మాయలాడి వలలో పడే మగవాళ్ళు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విచారణ చేయకుండా ఎలా  ఆమె ఉచ్చులో చిక్కుకున్నారో అర్దం కావటం లేదు. వివరాలులోకి వెలితే ,

   వరంగల్ కి చెందిన ఆమె బ్రతకడానికి ఏ వ్యాపారం అయితే బెస్ట్ అని ఆలోచించగా , ఆలోచించగా ఆమెకొక బ్రహ్మాండ మైన ఆలోచన వచ్చిందంట. ఇంతవరకు ఆడపిల్లలను పెండ్లిళ్ళ పేరుతో మోసం చేస్తూ  సమాజం లో దర్జాగా బ్రతుకుతున్న కొంత మంది నిత్యపెండ్లి కొడుకులు ఆమెకు స్పూర్తిగా నిలిచారు. మోసపు పెండ్లిళ్ళు చేసుకోవడం లో మగాళ్ళు పేటెంట్ రైట్ కలిగిఉండం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు సమానమే అని రుజువు చేసుకుంటున్న  ఆధునిక సమాజం  లో "మోసపు  పెండ్లిళ్ళు" విష యం లో మాత్రం స్త్రీలు తమ ప్రతిభను నిరూపించుకుంటె తప్పేమిటి ? అనుకున్నట్లుంది , వెంటనే ఆ పనిలో నిమగ్నమైంది.  

   2010 లో  ఫేస్ బుక్ లో ఒక I.D క్రియేట్ చేసింది. ఫోటో తనదే పెట్టింది కాని నకిలీ  అడ్రెస్స్ , నకిలీ ఆస్తుల వివరాలు పెట్టింది. ఆమెకున్న అందానికో , లేక ఆస్తుల మందానికో తెలియదు కాని, కాశిబుగ్గ కు చెందిన ఒక ధనవంతుడు ఈమె పెట్టిన ఫేస్ బుక్ ఉచ్చులో పడి , ఆమెను వివాహం చేసుకున్నాడు . ఆ పెండ్లి అయిన కొద్ది రోజులకే ఆమె అతడితో గొడవపెట్టుకుని అతని మీద గృహ హింస కేసులు పెట్టి , భారత రాజ్యాంగం, బార్యలుకు ఇచ్చిన రక్షణా చట్టాలను అతడి మీద అయుదాలుగా ప్రయోగించింది. దానితో దిమ్మ తిరిగిన ఆ ధనవంతుడు కాళ్ళ బేరానికి వచ్చి 10 లక్షలు ఇచ్చి ఆ మాయా వివాహం రద్దు చెసుకున్నాడు . మొదటి ప్రయోగం లోనే 10 లక్షలు రావడం తో ఇంతకు మించిన లాభసాటి వ్యాపారం మరోటి లేదని డిసైడ్ అయింది ఆ  మాయలేడి . 

       2012 లో మరల ఇదే విదంగా ఫేస్ బుక్ లో పెడితే , ఈ  సారి  హనమకొండ కు చెందిన ధనవంతుడు పడ్డాడు. అతడితోను సేమ్ టూ సేమ్ ప్రోసీడింగ్స్ . దానితో అతగాడు 15 లక్షలు సమర్పించి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఇక మూడో సారి ముచ్చటగా 2015 లో ఇదే విదంగా ఫేస్ బుక్ ప్రయోగం చేసింది. కాకపోతే ఈ  సారి నకిలీ ఆస్తులు తో పాటు నకిలీ తల్లి తండ్రుల ఫొటొలు కుడా పెట్టింది అట. దానికి ఒక NRI ముచ్చటపడి పోయి ఆమె తో పెండ్లికి సాయి అన్నాడు అట. కాకపోతే ఆ NRI కొంచం జాగ్రత్త పడి నమ్మకమైన వారితో ఆమె గురించి విచారణ జరిపిస్తే ఆమె చెపేది చేసేది అంతా మోసమే అని తెలియడం తో , పెండ్లి క్యాన్సిల్ చేసుకుని ఆమె మీద 420 కేసు పెట్టాడు. ప్రస్తుతం  ఆ కేసు విచారణలో ఉంది. 

   అయ్యా అదీ సంగతి. పెండ్లిళ్ళు చేసుకోవాలనుకునే వారు పెద్దలు మాట వినకపోతే వినక పోయారు . అటు ఏడూ తరాలు ఇటు తరాలు చరిత్ర పరిసీలించాలి అనే సాంప్రదాయ వివాహపూర్వపరిశిలనా పద్దతిని పాటించకపోతే పోయారు. ప్రైవేట్ ఇన్వెస్టిగషన్ సంస్తల తోనో , అది కాకుంటే కనీసం నమ్మకమైన వారితోనో  తమకు కాబోయే జీవిత బాగస్వాముల గురించి తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిది. వైవాహిక జీవితం  అనేది  పరస్పర నమ్మకం మీద ఆదారపడి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని సత్యం . అయితే వివాహం అయిన భార్యా భర్తల విషయం లోనే ఇది వర్తిస్తుంది. పెండ్లి చేసుకోబోయే వారి గురించి వివరాలు సేకరించడం లో నమ్మకం కాదు, వాస్తవమే కావాలి . దాని ననుసరించి వివాహం చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. కాని ఒక్క సారి వివాహం అయ్యాక పరస్పర నమ్మకం తప్పా వారిద్దరి మద్య ఏమి ఉండరాదు. ఆ నమ్మకం ని వమ్ము చేసే ఏ పనిని వారు చేయ రాదు. ఏదైనా అనుమానాలు పొడచూపితే వెంటనే ఇరువురూ చర్చించుకుని  పరిష్కరించుకోవడం మంచిది. 

         పై ఉదంతం లో  మోసాలు చేయడం లో స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరని నిరూపించిన ఈ మాయలేడి "పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపారం లో నకిలీ వివరాలు ఫేస్ బుక్ లో పెట్టి, ధనికులను పట్టి ,లక్షలు కొల్ల  కొట్టి  రికార్డు స్రుష్టించింది. 

  Source :        http://telugulocalnews.com/article/omg-a-woman-cheats-the-three-mens/


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

"పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపార

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×