Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జస్ట్ అనుభవం లేక జబర్దస్త్ రచ్చ చేసిన రోజా !!

                                                                         


                            ఆమె గారు ఆండ్రప్రదేశ్ లోని" నగరి " అనే నియోజక వర్గానికి MLA. సదరు నియోజక వర్గం లో ఓట్లు వేసిన ప్రజలలో మెజార్తీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆమే నగరి నియోజక వర్గ ప్రతినిదిగా , ఆ నియోజక వర్గ ప్రజల సమస్యలు వినిపించడానికి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కాని విచిత్రం ఏమిటంటె ఆంద్రా అసెంబ్లీలో ఆమె గారు ఎన్నో విషయాలు మాట్లాడింది కాని, అందులో నగరి ప్రజల సమస్యలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు లేదు. సభలో ఆమె హవబావ ప్రవర్తన తో కూడిన డైలాగులుకి  తట్టుకోలేక అధికారపక్షం వారి తీర్మాణం తో స్పీకర్ గారు 1 సంవత్సరం పాటు సభ నుండి సస్పెండ్ చేసారు.

                     దానితోఆమె మొదట తనకు న్యాయం జరపమని హైకోర్టు కి వెల్లింది. చట్టసభలు తిరిగి ప్రారంబం అయినప్పుడు తనకు అత్యవసర న్యాయం కావాలని, అందుకు హైకోర్టు వారు కేసు వాయిదాలు వేయకుండా వెంటనే తమ వాదనలు వినాలని చేసిన ఆమె వాదనను హైకోర్టు వారు పట్టించుకోకపోవడం తో , ఆమె వాదన వినడం లేదని , సుప్రీం కోర్టుకు వెళ్ళగా , ఆమె వాదనలు వెంటనే విని ఆమెకు న్యాయం చేయాలని సుప్రీం కోర్టు చెప్పడం తో తిరిగి హై కోర్టు  కు వచ్చి తన వాదనలు వినిపించింది.  ఈ సారి హైకోర్టు వారు ఆమె అబ్యర్దనను మన్నించి రోజా మీద స్పీకర్ విదించిన 1 సంవత్సరం సస్పెన్షన్ ఎత్తివేసింది. దానితో అధికోత్సాహం తో ఆర్డర్ పట్టుకు వెళ్ళిన ఆమె గారిని అసెంబ్లీ మార్షల్స్ గేటు వద్దనే అడ్డుకుని, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. దానితో తిరిగి  తన పార్టీ సబ్యులతో కలసి గోల గోల చేసింది. అంతలో ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరి వేసిన రిట్ అప్పీల్ లో హాయ్ కోర్టు వారు ఆమెకు ఇచ్చిన స్టే మీద స్టే ఇవ్వడం తో తెల్లముఖం వేసి , చివరకు సుప్తీమ్ కోర్టుకు తిరిగి వెళ్లి మీరే నాకు దిక్కు అని మొర పెట్టుకుంది.  

                                                               

  
                                     అసెంబ్లీలో బండ బూతులు తిట్టుకుని , కొట్టుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. రోజా గారి తో పాటు తోటి సబ్యుల మీద అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కుంటున్న మగ MLA కూడ ఉన్నారు. కాని వారెవరికి రాణి సస్పెన్షన్ తిప్పలు ఈమెకేఎందుకు వచ్చాయి అంటె "అనుభవ లేమి". ఇది నేను అంటున్న మాట కాదు. సాక్షాత్తు సుప్రీం కోర్టు వారే నిన్న రోజా గారి కేసు విచారణ సందర్బంగా అన్న మాటలు. MLA స్తాయిలో ఉన్న వ్యక్తులకు హోదా కు తగ్గ ప్రవర్తన ఉండాలి. తమ వ్యక్తిగత అజెండా ల కోసం సభా సంప్రదాయాలను ఉల్లగించడం సబబు కాదు. కేవలం వివరణ ఇచ్చి, తప్పు అనుకుంటే సారీ చెపితే సరిపోయే విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడం కరెక్టు కాదు" అని రోజారికి హితవచనాలు చెప్పి ఆమే చేత స్పీకర్ గారికి వివరణ ఇప్పించారు సుప్రీం కోర్టు వారు. దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా స్పీకర్ గారిగే అని స్పష్టం గా చెప్పారు. అలాగే ఆమె వివరణ ఇచ్చింది కాబట్టి దాని మీద ఉదారంగా వ్యవహరించాల్;అని స్పీకర్ గారికి పరోక్షంగా సలహా ఇవ్వడం కూడా జరిగింది. కేసు లో ఫైనల్ తీర్పు ఇవ్వకున్నా జరుగబోయేది స్పష్టం. ఆమె ఇచ్చిన వివరన తీసుకుని, కేవలం క్షమాపణ లతో  ఆమె మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడం జరుగుతుంది. 

   కోర్టులకు వెళ్ళకుండా  క్షమాపణలు చెప్పి , హుందాగా సస్పెన్షన్ వేటు నుండి బయపడిన పురుష MLA లు సాధిం చలేని ఘనకార్యం రోజాగారు ఏమి సాదించారు?. "బేరం నచ్చలేదని కాశికి వెళ్లి కొబ్బరి కాయ కొన్న వాడి తంతు మాదిరి ఉంది రోజా గారి వ్యవహారం . అసెంబ్లీలో సభా మర్యాదలు ను భంగపరచడం  ఎంత సులువో , దాని వలన  ఏర్పడే ప్రమాదం నుండి బయటపడం అంతే సులువు. ఇది "సిన్ " బాక్సులో నిలబడి కన్ఫెషన్ ఇవ్వడం లాంటిది. ఎన్ని పాపాలు అయినా చేయి . చర్చ్  లోకి  వెళ్లి ఫాదర్ కి తను చేసిన పాపం చెప్పి సారి అంటె చాలు . పాపులు విముక్తులు అవుతారు. అలాగే సభలో ఎంత నీచమైన మాటలు మాట్లాడినా వాటిని విత్ డ్రా చేసుకున్నాం అని చెప్పడమో లేక " నా మాటలు వలన ఎవరైనా భాదపడితే సారీ " అని స్టాక్ డైలాగ్ చెపితే ఫినిష్ ! సభ క్షమించేస్తుంది. ఇంత మాత్రం అనుభవం లేక రోజా గారు డిల్లీ దాక పోయి రచ్చ రచ్చ చేసినా , చివరకు "అనుభవం లేని అతివ " అనిపించుకుని ముఖం వేలాడేసుకుని రావడం తప్పా ఆమెకు ఒనగూడింది ఏమి లేదు.  

   కాబట్టి ఇకనుంచి అయిన సభలో అసభ్యంగా ప్రవర్తించే  MLA లు అంతా " సారీ " అనే మంత్రాన్ని పఠించి  తమ మీద పడబోవు సస్పెన్షన్ పిడుగు నుండి రక్షించుకోవచ్చు అని  రోజా గారి కేసు వలన తెలిసుకుంటారు అని ఆసిద్దాం. This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

జస్ట్ అనుభవం లేక జబర్దస్త్ రచ్చ చేసిన రోజా !!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×