Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది! ఈ మద్య తల్లి తండ్రుల ద్రుక్పదంలో మగపిల్లల విషయంలో కొంత మార్పు వస్తున్నట్టుంది.ఇదివరలో ఆడ పిల్ల "అక్కడి పిల్ల" అనే భావంతో ఉండేవారు. ఆడపిల్లని పెద్ద చదువులు చదివిస్తే,అంతకంటే ఎక్కువ చదివిన వరుణ్ణి తేవాలంటే, కట్నాలు ఎక్కవ ఇవ్వడమే కాక దొరకడం కూడ కష్టమయి పోతుందనే బావంతో, మగపిల్లల్ని చదివించినంతగా ఆడ పిల్లల్ని చదివించేవారు కాదు. మగపిల్లాడు అంటే తమను ముసలితనంలో ఆదుకోవల్సిన వాడు అనే బావంతో కూడ మగపిల్లలకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చే వారు.

 కాని రోజులు మారాయి. ఆడపిల్లల్ని ఇచ్చే దగ్గర తమ పిల్లకు సాద్యమయినంత వరకు అత్త పోరు, ఆడబిడ్డల పోరు లేని కుటుంబమయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు.ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయాయి. మగపిల్లలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలలో ఉండాల్సిరావడం,నేటి యువత ఎక్కువ స్వేచ్చ దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో, పెళ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు.దీనికోసం కుటుంబాలలోని,చిన్న చిన్న తగాదాలను బూతద్దాలలో చూపిస్తూ,మొగుళ్లని వేరు కాపురం కోసం వత్తిడి చెయ్యడం పరిపాటి అయిపోయింది.

  అలా వేరు కాపురాల వల్ల కొంచం ఆదపిల్లల్కి స్వేచ్చ లబించడం వల్ల తమ పుట్టింటి వారితో ఎక్కువ కాంటాక్ట్ కలిగిఉంటున్నారు. భర్త తరపువారిని నిర్లక్ష్యం చెయ్యక పోయిన తమ వాళ్ళ మీద చూపించినంట ప్రేమ మాత్రం చూపించడం చాల మందిలో తక్కువే.

ఈ మార్పు వల్ల తల్లి తండ్రులు కూడ తాము ముసలి తనం లో కూతురి దగ్గర ఉంటే సౌక్యంగా ఉంటుంది అని బావిస్తున్నారు.మగాడు ఎంత గట్టివాడైనా స్త్రీల మద్య ఉండాల్సిన అవగాహన,కొరవైనప్పుడు కలిగే ఆశాంతి వల్ల,బార్య ఇష్టానికే తలొగ్గుతున్నారు. ఈ విదంగా స్వేచ్చ జీవులైన ఆడ పిల్లలు దగ్గరకు ,మగపిల్లల్లు ఇంట్లో ఆదరణ కరువైన తల్లి తండ్రులు వచ్చేస్తున్నారు. కూతురింట్లో అయితే హాయిగా వంటింట్లో కూర్చుని కోరుకుంది చేసుకు   తినొచ్చు, క్కాని కొడుకింట్లో కోడలు చేసిందే తినాలి.కొడుకిల్లా? కూతురిల్లా? అనేది కాకుండా కూతురిల్లా? కోడలిల్లా? అని చూస్తున్నారు.కూతురింట్లో ఉన్నంత స్వేచ్చగా కోడలింట్లో ఉండటం కుదరుదుగా!

     అసలు స్వేచ్చ సంగతి దేవుడు ఎరుగు! అసలు అత్తలని కనీసం మనుషులుగా చూడని  "మహా కోడళ్ళు " ఈ మద్య ఎక్కువ అవుతున్నారు. మొగుడు మాట వినే వాడు అయితే ఎదో వంకతో కొంగుయ్న ముడి వేసుకుని అత్తా మామలకు దూరంగా తీసుకు వెలుతున్నారు. అది కుదరక పొతే అంటే మొగుడు తన తల్లి దండ్రులకు దూరంగా ఉండటానికి ఇష్టపడక పోయినా , లేదా అటువంటి పరిస్తుతులు లేక పోయినా కోడళ్లలో కలిగే అసహనం అంతా ఇంతా కాదు. అటువంటి ఒక కోడలు గారి దుష్ట దుష్క్రుత్యం ని క్రింది వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. ఒక వేళ అదే కూతురింట్లొ అయితే మరీ ఇలాంటి దుర్బర పరిస్తి టి ఉండదు కదా! అందుకే ఆధునిక కాలం లో తల్లి తండ్రులు కూతుళ్ళ వద్ద ఉండటానికే ప్రాదాన్యత ఇస్తున్నారు.

note : ఇది కేవలం కొంత మంది "మహాకోడళ్ళు " ను ద్రుష్టిలో పెట్టుకుని రాసింది . అందరూ అలా ఉండరు. అత్తా మామలను తల్లి తండ్రులు లా బావించి చూసుకునే వారు ఉన్నారు. అటువంటి వారికి సమాజం శిరస్సు వంచి ప్రణామం చేస్తుంది. కాని వారి శాతం రాను రాను తగ్గుతుందగా , మహా కోడళ్ళు శాతం పెరుగుతుంది. వారి నుద్దేసించే ఈ  ప్రస్తావన.

                                                             

                       (Republished . OPD 27/11/12).This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×