Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నీచమైన మగబుద్ది కి సాక్ష్యం ఈ 73 యేండ్ల ఖాజీ , 12యేండ్ల అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు !!?

                                                                       


                               ఒకటి చెప్పు ! రెండు చెప్పు! కోటి సార్లు కోసి చెప్పు! మగబుద్ది తీరే అంత!.శతాబ్దాలుగ మగాడిలో జీర్ణించుకు పోయిన ఆ బుద్ది ,"మగాడు మారాలి " మగాడు మారాలి " అని  స్త్రీ వాదులు స్లోగన్ లు ఇస్తేనో , కఠినమైన చట్టాలు చేసినంత మాత్రానో మారిపోదు. మొన్న కే.సి.ఆర్ గారు షీ టీం ల పని తీరు సమీక్షలో మాట్లాడుతూ , ఆడపిల్లలను ఈవ్ తీజింగ్ చేసే వారిలో కుర్రాళ్ళు కంటే నడి వయసు వారే అధికంగా ఉన్నారని సర్వే లో తేలినట్లు చెప్పారు. మైనర్ బాలికలను లైంగిక వేదింపులకు గురిచెయ్యడం లో తాతల పాత్ర ఏమి తక్కువ కాదు. అందుకే 10 యేండ్ల పిల్ల వాడి 80 యేండ్ల వృద్దుడి వరకు ఎవరైనా సరే, వాడు మగవాడే . వాడిలో ఉండేది మగ బుద్దే . కాకపోతే సమాజం లో చాలా మంది మగవాళ్ళను కట్టు బాట్లు , పరువు ప్రతిష్టలు , చదువు సంస్కారం,  అదుపులో పెడుతున్నాయి కాబట్టి  ఆడపిల్లలు మగబుద్ది నుండి రక్షణ పొంద గలుగుతున్నారు.  మగబుద్ది అడ్డూ అదుపు లేకుండా అక్కడక్కడా రెచ్చిపోతుందంటె అందుకు స్త్రీలు స్వీయ జాగ్రత్తలు పాటించక పోవడం కూడా ప్రదాన కారణమని ఎన్నో ఉదంతాలు తెలియ చేస్తున్నాయి. అలాంటిదే షాజాహాన్ పూర్ లో ఒక 12 యేండ్ల బాలిక పట్ల 73 యేండ్ల ఖాజీ "సయ్యద్" చేసిన ఘనకార్యం . దానిని క్రింది వీడియో లింక్ లో చూడండి.

                                     

 అతని పేరు "సయ్యద్ ". వయస్సు 73 యేండ్లు . చేసే పని ఖాజీ . అంటే ముస్లిం లకు మతపరంగా న్యాయమూర్తి . ఖ్యాజీ కి   పెండ్లిళ్ళు చేసి సర్టిఫికెట్ లు ఇచ్చే బాద్యత కూడా చట్టపరంగా గుర్తించబడింది.   . అయితేనేమి ఇతగాడి  ఒంటికి యేండ్లు వచ్చాయి కాని , అతనిలోని మగ బుద్దికి కొంచమైనా సిగ్గూ శరం లేవు. అతనికేదో దుకాణం  ఉన్నట్లు ఉంది. సరుకులు కోసం అచ్చిన ఒక 12 యేండ్ల అమ్మాయికి 10 రూపాయల ఆశ చూపి ఎలాంటి పాడు పని చేస్తున్నాడో చూడండి. మనవరాలి వయసు ఉన్న అమ్మాయిని ఆ విదంగా చేయటానికి అతనికి ఏ మాత్రం లజ్జా , బిడియం , మానవత్వం లేకుండా పోయాయి. అబ్లిక్ గానే ఆ నీచ కార్యం చేస్తున్న ఆ ఖాజీకి  గతం లో కూడా ఎంతో మంది ఆడవాళ్ళను లైంగికంగా వేదించిన  ఘన చరిత్ర ఉందట.

  ఈ ఖాజీ చర్యలను మొబైల్ లో రికార్డు చేయటం వలన , ఈ విషయం అమ్మాయి కుటుంభ సభ్యులకు తెలిసి , ఖాజీ మీద కేసు పెట్టడానికి వెళితే , మొదట పోలిస్ వారు ఖాజీ ఇచ్చిన డబ్బుకు ఆశపడి , అమ్మాయి తరపు వారిని తిట్టి పంపించారు అట.అంతే కాకుండా ఖాజీ కుటుంబ సబ్యులు అమ్మాయి తరపు వారిని ఉళ్ళో లేకుండా వెళ్లి పోమని బెదిరించారు అట. చివరకు అమ్మాయి బందువులు అంతా తగిన సాక్ష్యాలతో ఖాజీ మీద లిఖిత పూర్వక కంప్లైంట్ తో చర్యలకు సిద్ద పడితే , ఖాజీ అండ్ కో వారు ఊరు వదిలి పారిపోయారు అట. అదీ సంగతి.

    మైనర్ పిల్లలు ఇచ్చేఅంగీకారం చెల్లదని చట్టాలు చెపుతున్నాయి కాబట్టి  ఖాజీ కేసుకు బయపడి ఊరు వదిలి పారిపోయాడు కానీ, లేకుంటే "పిల్ల అంగీకారం తోనే సిగ్గు లేని పని చేసా " అని నిసిగ్గుగా చెప్పే వాడు అనుకుంటా?కాబట్టి అమ్మాయిలూ మగబుద్ది తీరును గమనించి జాగ్రత్తగా మెలగడం లోనే విజ్ఞత ఉంది , ఎవరో చెప్పే అవేశపు  అరువు డైలాగులు విని ,వీదుల్లోకి ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇచ్చినంత ఈజీగా  వాడి బుద్ది మారదు. అందుకు శతాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇక వీడియోను చూడండి.                   


    "   "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !

నేను పైన చెప్పినట్లు 10 యేండ్ల పోరగాడి దగ్గర్నుంచి , కాటికి కాలు చాపుకున్న ముసలి వారి వరకు అలాగే ఇండియాలో సుద్దులు చెప్పే ఎడిటర్ లు దగ్గర్నుంచి మెక్సికో మేయర్ ల వరకు ఎవరూ మగబుద్దికి అతీతులు కారు. ఇటువంటి మగబుద్దిని త్వరగా  పసికట్టే స్వబావం స్త్రీలకు సహజంగానే ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. కనీసం దానిని ఉపయోగించి అయినా జాగ్రత్తపడండి . ఈ  మగబుద్ది గురించి నేను ఎన్నో సార్లు ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగింది. వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు,"మగబుద్ది "  క్లిక్ చేసి చూడవచ్చు.

 సోర్స్:- http://www.uttarpradesh.org/trending-news-and-videos/qazi-shahjahanpur-molesting-minor-girl-uttar-pradesh-0862/
This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

నీచమైన మగబుద్ది కి సాక్ష్యం ఈ 73 యేండ్ల ఖాజీ , 12యేండ్ల అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు !!?

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×