Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సంసారం చేసినోళ్ళు కోర్టు కు వెళతారు ! సహజీ&#

                                                                                                    ఆవిడ పేరు పూజిత . మాజీ నటి . ఆమె గారు రాజేంద్ర ప్రసాద్ తో కలసి  నటించిన "ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ " చిత్రం ఆమెకు పేరు తేవడం తో అదే ఊపులో కొన్ని TV సీరియల్స్ లో  నటించింది. అయితే పాపం ఆమె గారి ప్రస్తుత పరిస్తితి నిజంగానే  "ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడికి "  మాజీ ప్రియురాలిగా ఉండాల్సిన స్తితి.  తనతో సహజీవనం పేరుతో 12 యేండ్లు కలసి ఉన్నవాడు హటాతుగా ఒక IAS అధికారిణి ని పెండ్లి చేసుకుని కాపురం , ఈవిడ గారు తనకు అన్యాయం జరిగిందని మీడీయా స్తూడియోలు చుట్టూ తిరుగుతూ గొంతెత్తి ఆక్రోసిస్తుంది. మరి వేరే మహిళ తో 12 యేండ్లు  సహజీవనం చేసిన వాడిని  రిజిస్టర్ మ్యారేజి చేసుకున్న ఆ IAS అధికారిణి మాత్రం తను అన్నీ తెలిసే , లీగల్ గానే  నటి పూజిత ప్రియుణ్ణి  పెండ్లి చేసుకున్నాను అని కూల్ గా చెపుతుంది. మరి ఇందులో ఎవరి వాదన కరెక్టు?

              సినిమా రంగం లో పెండ్లి అయిందంటే క్రేజీ తగ్గి సినిమా చాన్సులు రావు అనుకుందో ఏమో , తను ప్రేమించిన విజయ్ గోపాల్ అనే వ్యక్తితో ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా 12 యేండ్లు సహజీవనం చేసింది. వారి అన్యోన్య సహజీవనం కు గుర్తుగా ఒక పిల్లవాడు కలిగి ఇప్పుడు 12 యేండ్లు కుర్రవాడిగా మారాడు. విజయ్ గోపాల్ ప్రస్తుతం ఎవరో మినిస్టర్ దగ్గర P.A అట. పూజిత గారు చెప్పేదాని ప్రకారం ఆటను గతం లో ఎంతో మంది మహిళలను మోసం చేసి ప్రస్తుతం ఒక IAS అధికారిణి పెండ్లి చేసుకున్నాడు అట.

     తనకు డైవోర్స్ ఇవ్వకుండా సదరు IAS అధికారిణి ని ఎలా పెండ్లి చేసుకుంటాడు అని వారి మీద పోలిస్ కేసు పెట్టడానికి వెలితే అక్కడ అంజనా సిన్హా అనే IPS అధికారిణి "ఇంకొక సారి కేసు గీసు అని వస్తే ఎన్కౌంటర్ చేసి పారేస్తా అందట. దానితో బేజారెత్తిన పూజిత ఏకంగా మీడియా వాళ్ళ వద్దకు వచ్చి తన గోడు వెల్ల బోసుకుంటె , వారు ఈమే మీద జాఇతో కావచ్చు, లేక తమ రేటింగ్ ల అభివృద్ధి కోసం కావచ్చు తమ చానళ్ళ ద్వారా ఆమె గారి గోడును వెల్లబోసుకునే అవకాశం ఇచ్చారు .

      మన దేశం లో కోర్టులు  కంటె పవర్పులు  సమస్యా పరిష్కార వేదిక ఏదైనా ఉందంటె అది మీడియానే.  ప్రతి వాదులను కోర్టులకి రప్పించడానికి కనీసం నే రోజులు పడుతుందేమో కాని , మీడియా వారికి మాత్రం నిముషం చాలు. వెంటనే లైన్ కలిపి "ఈమె గారి బాదకు మీ సంజాయిషి ఏమిటి? అని సదరు ISA అధికారిణి ని అడిగేసారు. దాని తో ఆమె గారికి కోపం నసాలాని కి ఎక్కి ఉండవచ్చు. కాని అడుగుతుంది మీడియా అందులో లైవ్ షో . అందుకే కొంచం కూల్ గా తనకు , తన భర్తకు నటి పూజిత తో ఉన్న 12 యేండ్ల సహజీవనం సంగతి తెలుసు అని, కాని గత కొన్నేలుగా వారి మద్య ఏమి జరగటం లేదని, అందుకే అనీ ఎంక్యరి చేసి, లీగల్ గా అతడు ని పెండ్లి చేసుకోవచ్చు అని నిర్దారించుకున్నాకే ఆ అందగాడిని భర్తగా అంగీకరించాను అని చెప్పారు  అయినా సంసారం లో ఏవైనా సమస్యలు వస్తే చట్ట ప్రకారం కోర్టులుకి వెళ్లి పరిష్కరించుకోవాలి కాని , ఇలా స్టుడియోలో కూర్చుని శుర్పణక రాగాలు తీయడమేమిటని  ప్రస్నించారు. ఇలాంటి వారిని స్టుడియోలో కూర్చోపెట్టుకుని తన లాంటి కుటుంబ స్త్రీలను అందులో గౌరవనీయ పదవిలో ఉన్న వారని ప్రస్నించాడం మీడియా వారికి సబబు కాదని కూడా ఇండైరెక్టుగా చెప్పడం కూడా జరిగింది.
                                                                         


                              అయితే ఆ IAS ఆపిసర్ గారు ఐ 13 యేండ్ల సహజీవన చరిత్ర గలిగిన వారిని ఏరి కోరి ఎందుకు పెండ్లి చేసుకోవలసి వచ్చిందో ? సదరు పెండ్లికి వ్యతిరేకంగా IAS అధికారిణి గారి తల్లి తండ్రులు నటి పూజితకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ? అవన్నీ వారి పర్సనల్ విషయాలు కాబట్టి మనకు అనవసరం. కాని సమాజం లో సభ్యులుగా  మనం ఈ  కేసు ద్వారా తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ఒక ఆడ మగ కలసి పాతికేళ్ళు సహజీవనం చేసినా వారు ప్రేయసీ ప్రియులు అవుతారు తప్పా , భార్యా భర్తలు కాలేరు. భార్య భర్తలు కావాలంటే చట్టం గుర్తించిన ఏదో ఒక పద్దతి అనుసరించి తీరాలి. అది సాంప్రదాయక వివాహ పద్దతి కావచ్చు. రిజిస్టర్ మ్యారేజి కావచ్చు. 12యేండ్లు సహజీవనం చేసిన నటిమణికి దిని గురించి తెలియదు అనుకోలేము.

   పెండ్లి అయిన వారు చేసేది సంసారం అయితే , అది లేకుండా కలసి ఉండేదే సహజీవనం. సంసారం చేసే స్ర్తీ పురుషులకు ఉన్నని హక్కులు , బాద్యతలు సహజీవనం చేసే వారికి ఉండవు. ఇంకా  సహజీవనం చేసే పురుషులకు  "తలాక్ " లాంటి పెసిలిటి రెడీగా ఉంటుంది. తనకు ఎప్పుడు మొహం మొత్తితే అప్పుడు "తూ దీనబ్బా " అని సహజీవనిని వదిలేసి వెళ్ళవచ్చు ." తూ దీనబ్బా "  అని అనుకోవడమే వారికి తలాక్ లాంటి పెసిలిటి. ఇక అటువంటి పరిస్తితుల్లో సహజీవని ఏమి చేస్తుంది? విడాకులు తీసుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు అనలేదు. ఎందుకంటె పెండ్లే లేని సహజీవనం కి విడాకులు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందుకే కాబోలు ఆ IAS గారు అంత దీమాగా కోర్టుల్లోతేల్చుకుందామ్ రండి అని అనగలుగుతున్నారు. నిజమే కదా మరి?

  అయితే నటి పూజిత ఏమన్నా తెలివి తక్కువుదా ? పోయినోడు ఎలాగూ పోయాడు . కోర్టుకి పోతే టైమ్ వేస్ట్ . తనకు ఎలాగూ లీగల్ గా హక్కులు లేక పోయినా , రచ్చ చేసే అవకాసముంది. దానితో పరువు మర్యాద ఉన్నవారు అంతో ఇంతో ఇచ్చి సమస్యను పరిశ్కరించుకోవాలని చూస్తారు. కాబట్టి సంసారం చేయని తను  కోర్టుకు వెళ్లి  న్యాయం అడగంటం కంటె , మీడియా స్తూడియోల కు వెళ్లి శాపనార్దాలు పెడితేనే లాబం అని బావించి గోల చెయ్యడం మొదలు పెట్టి ఉంటారు. కడపటి సమాచరం ప్రకారం ఆమె తను గోపాల్ ని పెండ్లి చేసుకున్నాను అంటుందట. కాని డా క్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు అన్ కూడా అంటుంది అట. పోలిసులేమో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటేనే కేసు పెడతాం అని అంటె నాకు కొంచం టైం కావాలి అని అదిగిందట. ఈ  బాదలన్నిఎందుకు శుబ్రంగా ఒక తాళి బొట్టు కట్టించుకుని పది మందితో అక్షింతలు వేయించుకుంటే ఇలా స్టూడియోలు వెంట తిరుగుతూ అందరిని దేబేరించుకునే పరిస్తితి ఉండేది కాదుగా ? అంటె పెండ్లి అంటే మోజు తగ్గిపోద్ది. అదే సహజీవనం అయితే చేసే వారికి ,చూసే వారికీ యమ క్రేజో క్రేజ్ !  అదీ సంగతి .

లీగల్ గా  ఉంటె కోర్టుకు వెళ్ళు! లేకుంటే మంత్రి దగ్గరకు వెళ్ళు అనేది అనుభవజ్ఞుల మాట. అలాగే "సంసారం చేస్తే కోర్టుకు వెళ్లు ! సహజీవనం చేస్తే స్టూడియోకి  వెళ్ళు ! అనేది  కొంతమంది సహజీవనిల బాట . ఆ బాట లో  నడుస్తున్న  ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ హీరోయిన్ కి జయం కలుగు కాక!.

Source:- http://telugulocalnews.com/article/actress-facing-life-threat-by-husband-and-lady-ias-officer


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

సంసారం చేసినోళ్ళు కోర్టు కు వెళతారు ! సహజీ&#

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×