Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అసలు పెండ్లి చేసుకోవటం ఎందుకు ? బయటి సెక్స


                                                                                 

మొన్న దీపికా పడుకునే అనే ప్రసిద్ద నటిమణి తన మనసులోని బావాలను ఒక లఘు చిత్రం ద్వారా తెలియ చేస్తూ , వివాహిత స్త్రీలకు బయట సెక్స్ కావాలా ? వద్దా ? అనేది స్త్రీల చాయిస్ అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. ఆమె నటిమణి కాబట్టి , ఆమె కెరీర్ డెవలప్మెంట్ కి బహుళ  శ్రుంగారం (ఒకరి కంటె ఎక్కువమంది తో ) కావాలేమో ! కాని శుభ్రంగా పెండ్లి చేసుకుని , జీవితాంతం భర్తతోనే కాపురం చేసి, కుటుంభం కోసం పిల్లలను కనీ వారిని పెంచి పెద్దచేసి, వారిని ప్రయోజకులను చేసి , తన జన్మకు సార్ధకత చేకూర్చుకోవాలనుకునే , మహోన్నత స్త్రీ మూర్తులకు , బయటి సెక్స్ అనే    బావనలు ఉండాల్సిన అవసరం ఏముంది ?

  పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు యోగి వేమన . స్త్రీలలో కూడా "మై చాయిస్ "స్త్రీలు వేరు , అని అనేవాడు దీపికా పడుకునే లాంటి స్త్రీలు అయన జీవితంలో తారస పడి ఉంటె . వేమన కాలం లో సమాజంలో వర్గీకరణ , పని విభజన స్పష్టంగా ఉండెది .వేశ్యా వృత్తిని సమాజానికి అవసరమైన వృత్తుల్లో ఒకటిగా గుర్తించారు .కాని అప్పటి సమాజం సమ సమాజం కాదు కాబట్టి, ఇప్పటిలా పురుష వేశ్యలు (అక్కడక్కడైనా )లేరు .కేవలం  స్త్రీలు మాత్రమె వేశ్యా వ్రుత్తిని  అవలంభిoచారు . వారికి సమాజంలో గౌరవం కూదా ఉండెది . వారికి మాత్రం "మై చాయిస్ " అనే అనే హక్కు ఉండెది . ఎందుకంటె వారికి పెండ్లిళ్ళు ,పెటాకులు ఉండవు . తమకు నచ్చిన వారితో సంతానం పొంది తమ వంశ పారంపర వృత్తిని కాపాడుకునే అవకాశం ఉండేది . కాని  సమాజంలోని ఇతర స్త్రీలకు ఆ సౌకర్యం లేదు.

కాని ఆదునిక కాలంలో ఆ భాదలు లేవు కదా! పెండ్లి చేసుకోని వారిని పెండ్లి ఎందుకు చేసుకోవు? అని పురుషులని కాని స్త్రీల ను  గాని ప్రశ్నించడానికి వీలు లేని సమాజం మనది . కాబట్టి తమ వ్రుత్తి పరంగా కాని, స్వబావ పరంగా కాని బహుళ సెక్స్ కావాలనుకుంటే ,  పెండ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటాం అంటె ఎవరు కాదంటున్నారు? తమకు అవసరం అని చెప్పి , సమాజంలో అందరికి అలాంటి స్వేచ్చ కావాలని ఈ "అభినవ చింతామణి " లు కోరడం ఎంతవరకు సమంజసం?

 వివాహం అనేది  ఒక రకంగా ఒప్పందం లాంటిదే.ఆ ఒప్పందంలో తానూ తన వివాహ బాగస్వామితో తప్పా , ఇతరులతో సెక్స్ సంబందాలు పెట్టుకోకూడదు అనే నిభందన ప్రత్యక్షంగా కాని , పరోక్షంగా ఉంటుంది .    ఎక్కడో కొన్ని అనాగరిక సమాజాల్లో వివాహేతర సెక్స్ లకు అనుమతించవచ్చు . కాని ఎక్కువ బాగం , వైవాహిక వ్యవస్థ ఉన్న సమాజాలు అన్నీ బయటి సెక్స్ ను అంగీకరించవు.వివాహ వ్యవస్తే విశిష్టత గా కల మన దేశం లో  అస్సలు కుదరదు కాక కుదరదు. మరి అటువంట్టప్పుడు వివాహ ఒప్పందాన్ని ఉల్లంగించే స్వేచ్చా కావాలని ,నిర్లజ్జగా బరి తెగించి   అడగడం ఎంతవరకు సబబు?  దీపికా పడుకునే లాంటి వారిని పెండ్లి చేసుకోమని ఎవరు అడుగుతున్నారు? వారు పెండ్లి చేసుకోనంత మాత్రానా ఈ  సమాజానికి వచ్చే నష్టం ఏముంది? అసలు పెండ్లి చేసుకోవటం ఎందుకు ? బయటి సెక్స్ కోసం "బజారు కుక్క" లా వెంపర లాడడ మెందుకు?

 పెండ్లి చేసుకుని జీవిత బాగాస్వామిని మోసం చేసే వారి మీద ఒక నటుడు తీసిన లఘుచిత్రం ని క్రింద చూడండి. పురుషులు తప్పు చేస్తున్నారని , అలాంటి తప్పులు చేసే స్వేచ్చ తమకూ కావాలని కోరడం దిగజారుడు బావ ప్రకటన అవుతుంది కాని , మహిళా సాధికారత లో బాగం అనిపించుకోదు .

                         
                

                                      (Republished. OPD:7/4/2015)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

అసలు పెండ్లి చేసుకోవటం ఎందుకు ? బయటి సెక్స

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×