Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పది రూపాయల ఖర్చు కు వేనుకాడినందుకు , పది కత్తిపోట్లు తినాల్సి వచ్చిందట !

                                                                           
                                                                   


                            అది హైదరాబాద్ నగరo . నగరం అనగానే అంతా  నాగరికతే  వెళ్లి విరిస్తుంది అనుకుంటే పొరపాటే . ఒక పక్క ఎంత హాయ్ టెక్ కల్చర్ ఉంటుందో , మరొక పక్క బోల్డంత కంపు కొట్టే కల్చర్ ఉంటుంది . నగరం కాబట్టి మురుగు ఎక్కువుగానే ఉంటుంది . పందులు ఉంటాయో లేవో కానీ ఆ పందులు లేని లోటును అక్కడ కొంత మంది యువకులు భర్తీ చేస్తున్నారట . పని పాట చెయ్యలేని బేవార్స్ రకాలు కొందరు కొన్ని మరుగు ప్రాంతాలలో మాటు వెస్తారట . విరు పొద్దస్తమానం గుడుంబా తాగుతూ , గుట్కాలు నములుతూ ఎంజోయ్ చేస్తూ ఉoటారట  . మరి వీరికి డబ్బు ఏక్కడి  నుండి వస్తుంది అనేది అక్కడి పోలిసులకే తెలియాలి. వీరు మరుగు ప్రాంతాలలో ఎందుకు మాటు వేస్తారంటే , ఎవరైనా కక్కుర్తి గాళ్ళు అమ్మాయిలను తీసుకుని ఎంజోయ్ కోసం అటుగా వస్తే , మగాళ్ళను బెదిరించి , ఆడవాళ్ళని పాడు చెస్తారట . ఎలాగు అక్కడికి వచ్చేది పాడైన  రకాలే  కాబట్టి విషయం పోలిసుల దాక వెళ్ళదు  అని వారికి బోల్డంత నమ్మక్కం . అంతవరకు వారి నమ్మక్కాని ఎవరూ వమ్ము చేయ లేదనుకుంట!! కానీ వారి ఖర్మ కాలి , నిజమైన భార్య భర్తలు జంట , వేరే పని మిద అకడికి వచ్చి విరి దాడికి గురి అవ్వడం వలన విరి విషయం వెలుగులోకి వచ్చిo ది . అదెమిటంటే :

     మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేట మండలానికి చెందిన భార్యా భర్తలు హైదరాబాద్లోని ఒక మెటర్నిటి హాస్పిటల్ కి వచ్చారు .తన భార్యకి 8 నెలలు గర్బం కాబట్టి ,ఆమెను హాస్పిటల్ కి తీసుకు వచ్చాడు భర్త .  వారు బీదవారు అనడానికి ఎటువంటి సందేహం లేదు . కాని సులబ్ కాంప్లెక్స్ లో డబ్బులు కట్టే తాహతు లేక , 8 నెలల గర్భిని అయిన భార్యని టాయిలేట్ కోసం ఎక్కడికో దూరంగా మదుగు ప్రాంతానికి రాత్రి 11 గంటల వేళ నడిపించే బిదరికమా అంటే కొంచం అలోచించాల్సిందే !. 10 రూపాయలు మిగుల్చుకున్దామనుకుని ఉంటాడు . లేదా పల్లెటూరి వాళ్ళు కాబట్టి సులభ కాంప్లెక్స్ లో పని కానియ్యడం వారికి అంత  సులబం కాదు కాబట్టి కష్టమైనా దూరం వెళదాం అనుకుని ఉండవచ్చు .కాకపొతే వారు చేసిన పొరపాటు ఏమిటంటే  అచ్చంపేట లో ఉండే నాగరికతే హైదరాబాద్లో ఉందని అనుకోవడం .

   అలా వారు దూరంగా , పైన చెప్పిన రెండు కాళ్ళ  పందులు సంచరించే  ప్రాంతానికి వెళ్లారట . వీరిని చీకట్లో గమనించిన బేగం పేట కుర్రాళ్ళు 8 మంది అ ఇల్లాలికి ఉన్న గర్బం ని గమనించ లేక పోయారట . అబ్బా దొరికిందిరా కేసు  అనుకుని ఆమె మీదకు లంఘించ బోయే సరికి ఆమె భర్త వారిని అడ్డుకుని తన దర్మం తన నిర్వర్తిoచబోయాడు. అసలే పందులు! అ పై గుడుంబా తాగాయి! అవి ఊరుకుంటాయా ? వెంటనే  8 మందిలో ఒకడు  తన దగ్గర ఉన్న చిన్న చాకుతో , కస కసా పది పోట్లు పొడిచే సరికి , ఆమె ఏమో ఏడుస్తూ తానూ గర్బవతిని అని చెపుతుంటే , అ పండులుకి కొంత నిషా తగ్గి , ఏమి చెయ్యాల అని ఆలోచించుకునే లోపు బార్యా భర్తలు కొంత ఇవతలకు వచ్చి సహాయం కోసం పోలీసులకు కాల్ చేసారట . దానితో అ పందులు పారి పోయాయి . అ తర్వాత పోలీసులు రావడం భర్తను హాస్పిటల్లో జాయిన్ చేసి , నిందితుల కోసం స్పెషల్ టీం  లతో  గాలించి చివరకు వారిని పట్టుకోవడం  జరిగింది . వారు మొత్తం 8 మంది . అందులో 6 గురు బాల నిందితులు .అంటే వారికి రేప్ లు చేసే వయసు మాత్రమె వచ్చింది కాని శిక్షలు అనుభవించే అంత చట్టపరమైన వయసు రాని  వారు అని అర్దo

           అయితే వారి మిద నిర్భయ కేసు పెట్టినట్లు అని పించడం లేదు . క్రింది విడియోలో కేసు గురించి వివరిస్తున్న పోలిస్ ఆపిసర్ మాటలు చూస్తుంటే అదంతా ఒక ఎక్సి డెంటల్ గా ఆమె గర్బవతి అని తెలియక, అదేదో బ్రోతల్ కేసు అనుకోవడం వలన జరిగింది అని నిందితుల పట్ల కొంత సాప్ట్ కార్నర్ తో ఉన్నట్లు అనిపిస్తుంది . అందుకే నిర్భయ పెట్టలేదేమో! మీరు కూడా వీడియోను చూడండి . ఈ వీడియోను చూడడం వలన ఇంకొక లాబం కూడా ఉంది . కొత్తగా హిందీ నేర్చుకునే వారికి కొంత ఉపయోగ పడవచ్చు! ఏది ఏమైనా పై ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే "అనువు గాని చోట  సులబ్ కాంప్లెక్స్ లను వద్దన రాదు" .

               
                                                                 (20/3/2014 Post Republished)This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

పది రూపాయల ఖర్చు కు వేనుకాడినందుకు , పది కత్తిపోట్లు తినాల్సి వచ్చిందట !

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×