Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!

                               ఎదో హింది సినిమాలో ,ఒక లాయర్ పాత్రదారి చేత హిందూ మతం లో దేవుడికి చెసే 'పాలాభిషేకం ' గురించి ప్రశ్నింప చేస్తూ , భక్తులు "పిచ్చి పువ్వులు 'అనిపిస్తాడు దర్శక /రచయిత . దానిని విగ్రహారాదన అంటే ఈసడించుకునే అన్యమతస్తులు కొందరు  పేస్ బుక్ లో పెట్టి తమ మత విదాన  గొప్పదనాన్ని  చాటాలని ప్రయత్నించారు . దానిని చూసిన నాకు వారి అమాయకత్వం మీద జాలి వేసింది .

 మనిషికి   జ్ఞానం ముఖ్యమే .కాని అది ఉపయోగించే విదానం తెలియక పొతే  ఆనందానికి దూరం చెస్తుంది .ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే దానినే " ఇంగిత జ్ఞానం" అంటారు . అలాంటి ఇంగిత జ్ఞానం లేని వారు ,తమ మతాలలో ఉన్న లోపాలను కప్పి పెట్టుకుని ,ఎదుటివారి మతాల గురించి రంద్రాన్వేషణ చేస్తుంటారు . వీరు వేమన గారి పద్యంలో "గురివింద " బాపతు వాళ్ళు  . అలాగే విజ్ఞాన వాదుల0 అని చెప్పుకుంటున్న వారు సైతం  సమాజంలో విజ్ఞాన పరంగా జరుగుతున్న అనర్దాలు గురించి ఆలోచించకుండా ,కేవలం అలౌకిక అనందం ఇచ్చే హిందూ  మతాచారాలు లో శాస్త్రీయత లేదని   తెగ  సందేశాలు ఇస్తూ,    హిందువులు అంతా అజ్ఞానులు అని ప్రచారం చేస్తుంటారు .

        హిందువులు  దేవుళ్ళకు పాలాభిషేకం చేసినా ,పుట్టలో పాలు పోసినా అది అలౌకిక అనందం కోసమే .ఒక్కొక్క సారి ,కొన్ని లక్షల  రూపాయలు ఖర్చు చేసినా పొందలేని అనందం ,కొన్ని పాలు ఖర్చు తో సాద్యమవుతుంది అంటె అది "మత దృష్టి "వలననే .తొలి రాత్రి  మధురమైన ఉహలతో ,పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన నవ  వదువును 'రొమాంటిక్ దృష్టితో " చూస్తే వలపు పండుతుంది, శరీర విజ్ఞాన శాస్త్ర  దృష్టితో చూస్తే కడుపు దేవుతుంది . అందుకే మనిషికి ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే 'ఇంగిత జ్ఞానం 'ఉండాలి . మత విదానాలను సైన్స్ దృష్టితో చూసే వారు ఇలాంటి ఇంగిత జ్ఞానం లేనివారే .

మనిషికి అబ్బిన  శాస్త్రీయ జ్ఞానం నూటికి నూరు పాళ్ళు మేలు చేస్తుందా? ఈనాడు స్వచ్చమైన గాలి ,నీరు, ఆహరం కలుషితం అయ్యాయంటే దానికి కారణం శాస్త్రీయ ,సాంకేతిక జ్ఞానం .అంత మాత్రం చేత అటువంటి జ్ఞానం వద్దని అనుకుంటున్నామా ?అలాగే మత విదానాలు కూడా .ఎవరొ కొంత మంది తమ స్వార్ధం కోసం మత విదానాలు దుర్వినియోగ పరిస్తే యావత్ మతవిదానాలు బోగస్  అంటే ఎలా? ఈనాడు అన్నిటికంటే విలువైనది ఆనందం ..వేల కోట్లు ఉన్నవాడు కూడా దేవాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అంటే సైన్స్ విదానాలు  ఇవ్వలేని విలువైన  అలౌకిక అనందం మతవిదానాలు  ఇస్తున్నాయే  కాబట్టే .

మనం రొజూ తాగే పాలు నూటికీ 70% కలుషితం అయిన వేనట . విజ్ఞానం లేని నాడు పాలలో నీళ్ళు కలిపి 4 లీటర్లు పాలను 5 లీటర్లు చేసే వారు .కాని కలుషిత విజ్ఞానం పెరిగాక అర లీటర్ పాలను 10 లీటర్లు 'విష పాలు "గా మార్చి ఇంటికి సరపరా చేస్తునారు అంట . వారు పాలలో కలిపే పదార్దాలు లిస్ట్ చుస్తే గుండె గుబేల్ అంటుంది . మనం తాగే పాలు ను విష పూరితం అయి అనేక రోగాలుకు కారణం అవుతున్నాయి. మరి అటువంటి విష పాలను రోజూ త్రాగుతూ ,"పాలాభిషేకం ' కోసం ఉపయోగించే పాల వ్రుదా గురించి మాట్లాడడం  అజ్ఞానమా ?విజ్ఞానమా? ఆలోచించండి విజ్ఞాన బాబులూ ?
పాల కల్తి గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి  

             

                                                  (5/1/2015 Post Republished). 


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×