Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

విష్ణు రూపాయా, శివ రూపాయా " కంటే "దస్ రూపాయా, సౌ రూపాయా"నామార్చనే బెటర్ అంటున్నారు!


నమో సౌరూపాయా, నమో నమః 
                                                         

  మన పూర్వికుల జీవన శైలి కి అదునికులమని చెప్పుకునె మన జీవన శైలికి ఎంతో తేడా ఉంది.ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడీస్తున్న మహమారి అవినీతి. ఇదొక అంటువ్యాది వైరస్ లాగా అత్యంత వేగంగా మనలోకి వ్యాపించింది. దీనిని మన పెద్దలు చేసిన చట్టాలు తప్ప ఎక్కువమంది తప్పుగా బావించటం లేదు. ఎందుకంటే మనం కొలిచే దేవుళ్లు మారి పోయారు కాబట్టి. అదెలాగంటే

  మన పూర్వికులకు దైవభక్తి ఎక్కువ. అలాగే దైవబీతి కూడా ఎక్కువే. ఈ లొకం లో పాపం చేస్తే ,ఈలొకంలో కన్నా, పై లోకం లో బాదలు ఎక్కువ అనుభవించాల్సి వస్తుందనే భయం కూడా వారికి ఉండేది. అందుకే తెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు స్వామీ అని వేడుకునే వారు. అటువంటివారు "లంచం" అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికి భయపడే వారు.అన్నీ కాలాలోను నీతితో మెలిగే ప్రజలు తో పాటు అవినీతితో చరించే వారు కూడా ఉండొచ్చు. కాని ఎవరి పర్సెంటేజ్ ఎక్కువుగా ఉంది అనే దాని మీద మరి సమాజం లో ధనానికా, గుణానికా? దేనికి ప్రాదాన్యత ఇచ్చారు అనే దాని మీద ఆ సమాజపు విలువలు లెక్క కట్టాలి. అలా మన కంటే మన పూర్వికులే విలువలున్న సమాజంలో జీవించారు. వారు అనుభవించిన జీవితానందంలో మనమ్ అనుభవించేది తక్కువే అని చెప్పాలి.

  పొద్దునే లేచి, దొడ్లోకి వెళితే ’ఫ్రీ మోషన్’ కాదు. ఎందుకంటే మనం తినే జంక్ ఫుడ్ కానీయదు. ఎక్కువుగా మంచినీరు తీసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉండదు,కేవలమ్ "మందు కొట్టిన రాత్రుళ్లలో" తప్పా. ఆ తెల్లారే మోషన్ ఫ్రీ అయితే అది మందు మహత్యమ్ అనుకుంటారు, తప్పా దానిలో కలిపి తాగిన నీటి మహత్యం అనుకోరు. ఆ తర్వాత అదరా బదరా రెండు తోములు తోమేసి బ్రష్ అయిందనిపించేసి, గబగబా నీళ్ళు ఒంటి మీద కుమ్మరించుకుని, సబ్బుతో స్తానం కూడ అయిదనిపిస్తారు. అసలు లేచేదే ఆలస్యం, ఆ పై మల బద్దకం తో ఉన్న సమయం కాస్తా అయిపోయే సరికి ఇంట్లో ఉన్న దేవుడికి పూజ చేసే సమయం కూడ ఉండక పోవచ్చు. అందుకే డైలీ పూజలు చేసి టైం వేస్ట్ చేసే బదులు వారానికి ఒక సారి గుడికి వెళ్ళి టెంకాయ పెడిల్మనిపించి, అయ్యగారి పళ్లెంలో దక్షిణ,దేవుడి హుండీలో కానుక వేస్తే కోరినంత పుణ్యం వస్తుంది అని బావిస్తారు. కొంతమంది అయితే హుండిళో వెయ్యడం కన్నా అయ్యగారికి ఇస్తేనే పూజ ఘనంగా చేసి బాగా ఆశీర్వదిస్తారు అని వంద రూపాయలు అయ్యగారికి ఇస్తారు చిల్లర డబ్బులు హుండీలో వేస్తారు. ఇలా దేవున్ని ప్రసన్నం చేసుకునే టెక్నిక్ తెలిసిపోయింది కాబట్టి ంట్లో నిత్య పూజలు వేస్ట్ అనుకుని గబ గబా తయారై భార్య తయారు చేసిన అమ్రుతమ్ లాంటి పదార్దాలు తినడానికి ఒంట్లో ఉన్న "మధుమేహం" గాడ్ ఒప్పుకోడు కాబట్టి రెండు గోళీలు లోపలికి పంపి వాడిని అదమాయించి, ఆ పై పెట్టినది తిని ఆఫీసుకు వెళతారు.

   ఇక ఆఫీసులో కూర్చున్న దగ్గర్నుంచి పని పడి వచ్చే దేవుళ్ళ కోసమ్ చూస్తూంటాడు. ఎందుకంటే గాంధీ గారు కష్టమర్ లని దేవుళ్ళ లాగా చూడాలని, అన్నాడు కాబట్టి. కాకపోతే వీళ్ళు కష్టమర్లని కాక, వారిచ్చే రూపాయల్ని దేవుళ్లుగా చూస్తారు. అలా గాందీ గారి సూక్తిని ఆయన బొమ్మ ఉన్న నోట్లును దైవ భావమ్తో  తీసుకొనడం ద్వారా అమలు చేస్తున్నారు అన్న మాట!. కొన్ని ఆఫీసులు అయితే సాయంత్రం ఆరు తర్వాతే ప్రారంభం అవుతాయట!. మరి డబ్బు దేవుళ్ళు అప్పుడే వస్తారు కాబట్టి. ఇలా రోజూ వంద రూపాయలను, వేల రూపాయలను పూజిస్తూ కోట్లు గడించి, ఇంట్లో సర్వ సౌఖ్యాలతో, ఒంట్లో సర్వ రోగాలతో అలరారుతూ ఉన్నారు ఆధునికులు.వీరి సకల సౌఖ్యాలు ఏమిటో ఇంకొక టపాలో చెపుతాను.ఇలా ఇంట్లో పనివాడి దగ్గర్నుంచి, గుళ్ళో పూజారి దాక ఆసించేది ధనమే తప్పా వీరీ గుణం కాదు కాబట్టి "విష్ణు రూపాయా, శివరూపాయ" బదులు "దస్ రూపాయా, సౌ రూపాయా" అని నిత్య నామార్చన చేస్తూ సుఖంబుగా ఉండబట్టినారు ఆధునికులు.       
   
                                          (13/7/2013 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

విష్ణు రూపాయా, శివ రూపాయా " కంటే "దస్ రూపాయా, సౌ రూపాయా"నామార్చనే బెటర్ అంటున్నారు!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×