Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

"మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!


                                                                    


                                     ఈ మద్య కాలంలో "రసాయనిక మగవాళ్లు" ఎక్కువైయారు.అటు యువతలో, ఇటు మద్య వయస్సు వారిలో కూడ ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉన్నారు.అదేమిటంటె, ఎంతమంది స్త్రీలతో ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉంటే,అంత గొప్ప మగవాడు అని.

   నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు . అతను ఒక హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. బార్యా, ఇద్దరు ఆడ పిల్లలు. బార్య బాగానే ఉంటుంది. కాని ఇతనికి పర స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతను గంటల తరబడి ఇతర స్త్రీల తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇతరులెవరఈనా అది చూసి జెలసీ ఫీలవుతా ఉంటే, ఇతను గొప్పగా మురిసి పోయే వాడు. ఎప్పూడూ ఫ్రెండ్స్ తో కలిసిన తన "రసిక" పురాణాం చెపుతూ గొప్పలు పోయే వాడు. నేను చాలా సార్లు మందలించాను. ఇతర స్త్రీల కోసం నువ్వు చూపే శ్రద్ద, డబ్బు దుబారా తగ్గించి, అది కుటుంబం కోసం వినియోగిస్తే బాగుంటుంది కదా అని. దానికి అతను తను ఒక్క నయా పఈసా ఖర్చు చెయ్యనని, తనంటే ఇష్ట పడే స్త్రీలే తనకు ఎదురు డబ్బులు ఇస్తారని చెపితే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. వాడు చెప్పే ఆ మాటలు నిజమా అని పించేది. సరే నీ కర్మ అని అతని మానాన అతన్ని వదలి వెయ్యడం అయినది.ఆ తర్వాత తెలిసింది అతను చెప్పింది అబద్దం అని.

   మొన్న ఒక రోజు అతని బార్య మా ఇంటికి వచ్చి అతని గురించి చెప్పి ఘొల్లుమన్నది. అతనిని చూడక ఒక సంవత్సరం అయిందనుకుంటా. ఈ మద్య కాలంలో అతని బార్య మెడలోనిది, ఇంటిలోని బంగరం అంతా కుదవ పెట్టేసాడట.ఆ బంగారం అమ్మినా ఆ కుదవ పెట్టిన అప్పు తీరదని,వాటిని విడిపించలేదట. పిల్లల్ను స్కూల్ ఫీజ్ కట్ట లేక స్కూల్ మాన్పించాడట. హోటల్ కోసం అని తీసుకున్న "గిరి గిరి"  అప్పుల వాళ్ళని తప్పించుకోవడం కోసం హోటల్ ని మూసేశాడు. ఇతర స్త్రీల వల్ల లబించిన రోగాల బహుమతుల పుణ్యామాని డాఖ్టర్ ఫీజులు ఎక్కువయ్యాయట. ఈ పరిస్తితిలో తనకు దిక్కు తోచడం లేదని సలహా చెప్పమని వచ్చింది ఆ ఇల్లాలు. నాకు ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. బాగున్న రోజుల్లో నేను చెప్పిన సలహా ప్రకారం మొగ్గుణ్ణి అదుపులో పెట్టే చర్యలు చేపడితే ఆమే కు ఈ తిప్పలు తప్పేవి. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఏమి ప్రయోజనం?. అతనికి ఎయిడ్స్ కూడా వచ్చిందేమోనని అను మానం.

   ఆ అమ్మాయికి అదే చెప్పి, ముందు సరి అయిన వైద్య పరీక్షలు చేయించ మని చెప్పాను. ఆమె అత్త మామలతో అప్పటి వరకు ఆమేకు ఉన్న వైరాన్ని మాని, వారితో సఖ్యత పెంచుకుని వారు చెప్పినట్లు విని కుటూంబాన్ని కాపాడుకోమని చెప్పాను. ఆమే సరేనంటూ వెల్లీ పోయింది. ఇప్పుడు ఆ రసిక వీరుడు రసం లేని చెరకు పిప్పి లాంటి వాడు. అతడు అటు కుటుంబానికి ఇటు సమాజానికి బారమే కాని, ఉపయోగపడే వాడు కాడు. పై పెచ్చు కుటూంబానికి బారంగా మారాడు. అతను బ్రతికినంత కాలం తన "రంకు చరిత్ర" నెమరు వేసుకోవడం తప్పా చేయ గలిగింది ఏమి లేక పోవచ్చు.ఒంట్లో ఉడుకు నెత్తురు ఉంది కదాని, జేబులో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అటు ఆరోగ్యాన్ని, ఇటు డబ్బుని నాశనం చేస్తూ,యెచ్చులు కొట్టె అతని లాంటి వారు చాలా మంది ఉండవచ్చు.   

  కాబట్టి మగతనం అంటే, ఆడవారి కోసం వెంపర్లాడేది కాదు, వారిని వేదించేది అంతకంటే కాదు. కేవలం వారిని సర్వ సంకెళ్ళ నుండి విముక్తులను చేసేది  మాత్రమే. వారు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఆలి కావచ్చు, కూతురు కావచ్చు,సమాజంలోని ఏ స్త్రీ అయిన కాని వారి కాపాడే వాడే నిజమయిన మగవాడు.   
                                                         (17/4/2013 Post Republished)    
                                                                


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

"మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×