Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రియుడిని కలువ వద్దన్నందుకు తండ్రిని అతి దారుణంగా చంపడమే కాక ,అతనిని" రేపిస్ట్ " గా చెపుతున్న కూతురు!

                                                                             
 


                                   ఈ కలి కాలంలో  ఎవరి మాటలు నమ్మాలో , ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావటం లేదు . రంకు నేర్చినోల్లు బొంకు నేర్వక పొతే ఒళ్ళూ ఇల్లూ గుల్లవుతుంది కాబట్టి , రంకు కు బొంకు ఎప్పుడూ హచ్ డాగ్ లాగా ఫాలో కావాల్సిందే .కాబట్టి ఎవరి మాటలు అయినా నమ్మొచ్చు కాని , ఇతరుల వ్యామోహం లో పడి కన్నూ , మిన్నూ కానక ప్రవర్తించే వారి మాటలు నమ్మడం కష్టం . మొన్ని మద్య డిల్లి లో జరిగిన ఒక 56 యేండ్ల వ్యక్తీ మర్డర్ అనేక అనుమానాలను, తండ్రి బిడ్డల మద్య ఉండే సహజ ప్రేమానురాగాలను అనుమానించేలా   చేస్తుంది .

                        అయన 56 యేండ్ల వ్యక్తీ . అతనికి 3 కుమార్తెలు , భార్యా ఉన్నారు . దిల్లిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం . ఇరువురి కుమార్తెలు వివాహం చేసాడు . 3 యేండ్ల క్రితం భార్య చని పోయింది . చిన్న కుమార్తె వయస్సు ప్రస్తుతం 23 సంవత్సరాలు . తండ్రి ఉద్యోగానికి వెళ్ళాక ఆమె ఒక్కతె ఇంట్లో ఉంటుంది . ఆమెకు ప్రిన్స్ సందు అనే వాడితో పరిచయం ఉండడమే కాక అది ప్రేమ గా మారింది . తండ్రి ఇంట్లోనుంచి బయటకు వెళ్ళగానే వారింటికి ప్రిన్స్ రావడం పరి పాటి . ఇది తెలిసిన తండ్రి మందలించాడు . అలా అయన గారి మందలింపులు ఎక్కువ అవ్వడమే కాక ప్రియున్ని కలవడానికి విలు లేకుండా కట్టు దిట్టం చేసాడు . దీనితో కూతురు ప్రియుడు మరియు ఇంకొక స్నేహితుడుతో కలసి తండ్రిని చంపడానికి ప్లాన్ సిద్దం చేసింది .
  
                              అ రోజు రాత్రి తన తండ్రి పండుకుని ఉన్న సమయంలో , తమ ప్లాన్ లో భాగంగా ప్రియుడిని , స్నేహితుడిని ఇంట్లోకి అహ్వానిమ్చింది . వారు మొదట క్రికెట్ బ్యాట్ తో తండ్రిని 20 సార్లు తల మిద కొట్టారు . అ దెబ్బలకే అయన చనిపోయాడు . అయినా వారికి అనుమానం తిరక కేబుల్ వైరుతో గొంతుకు ఉరి బిగించి గుంజి గుంజి చూసారు . అ తర్వాత ఒక కత్తితో చాతిని చీల్చి గుండెలోని బాగాన్ని బయటకు తీసిన తర్వాత కాని అయన చనిపోయి ఉంటాడని నిర్దారణ కాలేదట వారికి! అలా క్రూరంగా చంపాక అతడిని అతను ఉపయోగించే ఇన్నోవా కారులోనే  పడేసి దానిని కొంత దూరం తీసుకువెళ్ళి అక్కడి పెద్ద డ్రైనేజ్ లో నెట్టేసి ఇంటికి వచ్చి ఊపిరి పిల్చుకున్నారట .

     అ తర్వాత పోలీసులకు డ్రైనేజ్ లో ఉన్న ఇన్నోవా కారు దానిలోని డేడ్ బాడి గురించి సమాచారం అందడం , వారు కేసు నమోదు చేసి కోపి లాగడం , కూతురు పొంతన లేని వివరణలు ఇవ్వడంతో ఆమె మిద అనుమానం వచ్చిన పోలీసులు చుట్టూ ఉన్న వారిని విచారించగా వారి ఇంటికి తండ్రి లేని సమయాల్లో వచ్చె ప్రిన్స్ గురించి తెలిసింది . అతడి ని తీసుకు వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది . అయితే తన తండ్రిని చంపటానికి అ అమాయి చెపుతున్న కారణం సబ్య సమాజాన్ని నివ్వెర పోయేలా చేస్తుంది . తన తండ్రి బ్తనాను గత 3 ఏండ్లుగా లైo గికంగా వేదిస్తున్నాడు అని అందుకే తన ప్రియుడి సహాయంతో అతడిని హత మార్చాను అని అ అమాయి చెపుతున్న మాటల్లో నిజమెంత? 3 యేండ్ల నుండి వేదిస్తుంటే తన అక్కలకు కాని , బందువులకు కాని ఎందుకు చెప్పలేదు ? ఇప్పుడు తండ్రి ని చంపి అ విషయం చెపితే దానిని ఎలా నమ్ముతారు ? నిచమయిన తన ప్రవర్తన ని సమర్దిమ్చుకోవడం కోసం తండ్రి క్యారెక్టర్  నీచంగా చిత్రి కరిస్తుంది అనుకోవచ్చుగా ?

    ఏది ఏమైనా పోలిస్ వారు ఈ  కేసును  కేవలం సాదారణ మర్డర్ కేసు గా కాక , సామాజిక, కుటుంభ సంబందాల కోణంలో కూడా ఆలోచించి దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది . అప్పుడే, దిగజారుతున్న మానవ సంబందాల మిద సమాజంలోని పెద్దలకు  ఒక అవగాహన ఏర్పడుతుంది . దానివలన ఎ సంస్కరణలు చేపడితే సమాజంలో మానవ సంబందాలు ఆరోగ్య కరంగా ఉంటాయో ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది . లేకుంటేమానవ సమాజం జంతు సమాజంగా మారడానికి  ఏంతో కాలం పట్టదు .
                                                      (6/5/2014 post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ప్రియుడిని కలువ వద్దన్నందుకు తండ్రిని అతి దారుణంగా చంపడమే కాక ,అతనిని" రేపిస్ట్ " గా చెపుతున్న కూతురు!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×