Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రత్నాల నమ్మకాలను నమ్మని T.V 9 వారికి , రాణుల " శాపాలు " మీద నమ్మకమేనట!


                                                     T.V. 9 తెలుగు చానల్ వారు తెలుగు ప్రజలలో ఉన్న మూడ నమ్మకాలను పారద్రోలి వారిని చైతన్యవంతులు చేయాలనే తపనతో ఉన్నట్లు, ప్రతి  పావు గంటకు ఒక సారి వారు   పని కట్టుకుని చేసే స్లోగన్లు తెలియచేస్తుంటాయి . దానికోసం వారు  ప్రజల నమ్మకాల మిద దాడిచేస్తుంటారు . ఉదాహరణకు తెలుగువారిలోనే యావత్ భారతీయులలో పేరుకు తగినది అనో , జాతక చక్రం ప్రకారమో, వజ్రం, కెంపు, పచ్చ లాంటి వాటితో పొదిగిన ఉంగరాలు ధరించే నమ్మక్కం ఉంది . వాటి మీద మన రాష్ట్రంలో కోట్ల బిసినెస్ టర్నోవర్ అవుతుంది . శాస్త్రీయ విజ్ఞానులం అని చెప్పుకునే వారికి అవి అప్త్రాల్ "రంగు రాళ్ళు " కావచ్చేమో కాని , వాటి మిద వ్యాపారం చేసే వారికి మాత్రం అవి ఖచ్చితంగా కోట్లకు పడగలెత్తించె విశ్వాస  నిధులు . ఇక ప్రజలు కూడా వాటిని నమ్మి దరిoచడమే కాక వాటి వలన అంతో ఇంతో మేలు జరుగుతుoడబట్టే  వారిలో నమ్మకం దిన దిన ప్రవర్ధమాన మవుతుంది అనుకుంటున్నాను . ఇదే విషయంలో నా స్వానుభవం కూడా ఉంది . అదేమిటంటే :

       పది యేండ్ల క్రితం అనుకుంటా ఒకాయన నా జాతకం చూసి "మీరు పచ్చపొదిగిన ఉంగరం ధరిస్తే చాలా మేలు జరుగుద్ది అంటే  నేను నవ్వి ఊరుకున్నాను . నేను మా ఇలవేల్పు లక్ష్మి నరసింహ స్వామీ మిద అచంచల మైన నమ్మకం ఉన్నవాడిని . నా పరిదిలో లేని దాని గురించి నేను ఎప్పుడూ కలత చెoదను. నా వెనుక నరసింహ స్వామీ శక్తి ఉందన్న బావం నిరంతరం నాలో ఉంది . కొన్ని కొన్ని విపత్కర సమయాలలో నాలో ఉన్న తెలివి తేటలు కంటే , నాకు అ స్వామీ కల్పించిన పరిస్తితులే కాపాడాయి .  . బయట వారికి అవి నా తెలివి తేటలు అని అనిపించినా నిజం అది కాదు .అది  నాకు మాత్రమె తెలుసు. అందుకే నేను "పచ్చ " గురించి పట్టించుకోలేదు . కాని నా శ్రీమతి పోరుతో నమ్మకం లేక పోయినా పెట్టుకున్నాను . అంతే!  అ నెలలో నేను పొందిన అనుభవం ఎప్పటికి మరువలేను .

                  పచ్చ కలిగిన ఉంగరం పెట్టిన వారం రోజులలో నాకు ఆర్దిక నష్టం ఒకటి జరిగింది . మా పాపకు డెంగ్యూ జ్వరం వచ్చి తీవ్ర స్తాయిలోకి వెళ్లి తిరిగి కోలుకోవడం జరిగింది . రావలసినవి  రాక పోగా  అదనపు ఖర్చులు , ఆరోగ్య సమస్యలు ఇలా ఒక నెలలోనే , అప్పటివరకు చాలా ప్రశాంతంగా నడుస్తున్న మా కుటుంబం ఒక్క సారిగా ఒడిదుడుకులకు లోనయ్యింది . దానితో ఆ పచ్చ ను తీసి పారేసాను . దానితో మళ్లి ఎ ఆటంకాలు లేకుండా సాపిగా సాగిపోతుంది జీవితం . అయితే ఇక్కడ రంగు రాళ్ళ విషయంలో నాకు అనుభవమయిoది "నేగటివ్  ఎపెక్టు ". అందుకె నేను దానిని తిరస్కరించాను . ఒక విషయానికి నెగటివ్ ఎపెక్టు ఉంటె కచ్చితంగా పాజిటివ్ ఎపెక్టు కూడా ఉంది తీరాలి . అలా పాజిటివ్ ఎపెక్టు అనుభవం అయినవారికి వాటి మిద నమకం ఉండడం సర్వ సాదారణం . కోటి T.V. 9 లు స్క్రోలింగ్లు ఇచ్చి ప్రచారం చేసినా అది మారడం అంత  తేలికైన పని కాదు. కాకపొతే పూర్తిగా ఇలవేల్పు శక్తిని నమ్మిన నా లాంటి వారికి రత్నాలు , వజ్రాల ధరించడం  వల్ల నష్టమే  ఒరిగిదేమీ లేదు అని అన్పిస్తుంది నాకు.
 
                            నిజంగా T.V. 9 వారికి మూడ నమ్మక్కాలు మిద వ్యతిరేకత ఉందా అంటే , అది అంతా వారి ప్రచార పటాటోపమే తప్పా , వేరు కాదు అని ఈ మద్య వారు ప్రసారం చేసిన ఒక కార్యక్రమం వలన తెలిసింది . రంగు రాళ్ళను ధరించడం మూడ నమ్మక్కం అని తెగ ఊదరగొట్టే చానల్ వారికి,కన్నడ దేశంలో ఒక రాణి  ఇచ్చె శాపాలు పనిచేస్తాయని చెప్పడం మూడ నమక్కం కాదా ?     T.V 9 వారు ఒక కార్యక్రమంలో మైసూర్ రాజుల చరిత్ర గురించి చెపుతూ , వారి వంశం లో మగ వారసులు కలగక పొవాడానికి కారణం ., సదరు వంసస్తులలో ఒక రాజు గారికి  శత్రు రాజ్యానికి చెందినా ఒక రాణి ఇచ్చిన శాపమట ! అందుకే వారెవ్వరికి తరం  విడచి తరం లో మగ సంతానం లేక పిల్లల్ని దత్తత చేసుకుంటున్నారట . అయితే T.V 9 వారి కధనం ప్రకారం సదరు శాపం ఇచ్చిన స్త్రీ "మైసూర్ రాజవంశం పూర్తిగా మగ పిల్లలు లేకుండా పోతారు అని . కాని మైసూర్ రాజులు తరం విడచి తరంలో పుత్ర సంతతి పొందుతున్నారు అని తెలుస్తుంది . అలా అయితే సదరు రాణి గారి శాపం ఎక్కడ పలిo చిందో , దానిని పని కట్టుకుని T.V 9వారు ఎందుకు చెప్పారో అర్ధం కాలేదు . ఏది ఏమైనా నాకు అర్ధం అయింది ఒకటే T.V చానల్ వారు ఏమి చేసినా , ఏది మాట్లాడినా వారి చానల్ రేటింగులు కోసం తప్పా , సమాజ ఉద్దరణకు మాత్రం కాదు . అందరి కంటే ఏదైనా డిపరెంట్  గా చేస్తేనే కదా , జనం చూపు వారి వైపు మళ్లేది! అందులో బాగమే మూడనమ్మకాల మిద పోరాటo అనే తంతు ప్రసారాలు! దట్సాల్!
                                                                   
    Video Link:https://youtu.be/OFuat_ASU3U  (Republished Post,OPD: 9/4/2014)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

రత్నాల నమ్మకాలను నమ్మని T.V 9 వారికి , రాణుల " శాపాలు " మీద నమ్మకమేనట!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×