Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కామ పిశాచులు ని " నిర్భయ" చట్టం నిరోదించలేదని తెలియచేస్తున్న "గార్ల కిరణ్మయి " ఉదంతం

                                                                   
         


                                           చట్టాలు నేరస్తులను శిక్షించ గలవు! కానీ వారిని నేరాలు చెయ్యకుండా ఆపగలవా? ఇది ఇప్పుడు సమాజంలోని ప్రతి ఒక్క మేదావి ఆలోచించవలసిన అంశం . "కామా తురాణం నభయం, న లజ్జ " అంటారు. కామంతో కళ్ళు మూసుకు పోయి ప్రవర్తించే వాడికి, ఒళ్లంతా కామ పిశాచం ఆవహించి ఉన్న వేళ , వాడికి "నిర్భయ " చట్టం గుర్తుకు వస్తుందా? చచ్చినా రాదు. పైగా పాప కార్యం అయి పోయాకా , అప్పుడు చట్టం గుర్తుకు వచ్చి, సాక్ష్యాలు దొరకకుండా ఏమి చెయ్యాలని చూస్తాడు. చివరకు బాదితురాలిని చంపడానికి కూడా  వెనుకాడడు. మరి ఇటువంటి కామ పిశాచుల నుండి అమాయకపు ఆడపిల్లలను రక్షించడానికి సమాజంలో కేవలం  కఠిన చట్టాలు ఉన్నంత మాత్రానా సరిపోదు అని  ఖమ్మం జిల్లా , గార్ల మండలం, తిర్లాపురం గ్రామం లో జరిగిన సంఘటన చాటుతుంది.

 ఆ అమ్మాయి పేరు కిరణ్మయి . వయసు 13.ఖమ్మంలో  ఎనిమిదవతరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి తమ తల్లి తండ్రులకు పొలం పనులలో సహాయం చేస్తుంది. అటువంటి అమ్మాయి ఒక రోజు ఒంట్లో బాగోలేక తల్లి తండ్రులతో పాటు చేనుకు వెళ్ళ లేక పోయింది. అదే ఆమె పాలిట శాపమయింది . పిల్ల ఒంటరిగా ఉన్న విషయాన్ని కనీ పెట్టిన పొరుగు వాడు ఒకడు సెల్ చార్జింగ్ నెపంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోయాడు . దానికి ఆ అమ్మాయి తీవ్రంగా ప్రతిగటించడంతో , ఆమె ఒంటి మీద కిరోసిన్ పోసి తగుల పెట్టి పారి పోయాడు. పాపం ఆ అమ్మాయి ఆ మంటలకు తట్టుకోలేక, కేకలు పెడుతూ పోయి నీటి గాబులో కూర్చుండి పోయిందట. కానీ ఆమె ను హాస్పిటల్లో చేర్పించిన పలితం లేకుండా పోయింది. పది రోజులు మ్రుత్యువ్యు తో పోరాడి నిన్ననే చని పోయింది. ఆ అమ్మాయి తండ్రి పిర్యాదు మేరకు పోలిసులు కామ పిశాచి బాబురావు మీద "నిర్భయ " కేసు పెట్టి విచారణ చేస్తున్నారు.

  పై కేసులో నిందితుడు బాబు రావు కి నిర్భయ చట్టం ఉందని తెలియదా? అది చాలా కఠిన మయిందని తెలియదా ? ? ఖచ్చితంగా తెలుసు! మరి అయినా నేరం చెయ్యడానికి ఎందుకు భయపడలేదు? కామ పిశాచి యొక్క శక్తే అటువంటిది . అది కాష్మోర కంటే భయంకరమైనది. అది మనిషిలోకి  రాకుండా ఉండాలంటే కట్టుబాట్లతో కూడిన నైతిక జీవన విదానం నకు మనిషి అలవాటు పడాలి. 'అష్టాంగ మార్గం" అవలంబించకున్నా , కనీసం ఆమోద యోగ్యమైన పద్దతి అంటే "వివాహ పద్దతిలో " కోరుకున్న బాగస్వామి ని చేపట్టి వారితోనే తన కోరికలు నెరవేర్చు కోవాలి . అలాగే అనైతిక జీవన విదానం అవలంభించే వారిని తీవ్రంగా నిరసించాలి. అనైతిక  పరులు ఎంత దనవంతులైనా సరే వారికి విలువ ఇవ్వ రాదు. మనిషికి గుణం బట్టి విలువ నిచ్చే వ్యవస్తను పునరుద్దరింప చేయాలి. ఇలా కొన్ని  కట్టుబాట్లును ఆచరిస్తే తప్పా, సత్సమాజ నిర్మాణం సాద్యం కాదు. అప్పుడే కాష్మోరా లాంటి కామ పిశాచిని  "అష్ట దిగ్బందనం " చేయగలుగుతాము. "స్వనియంత్రణ  లేని వారు ఖచ్చితంగా సమాజ నియంత్రణకు గురి కావాల్సిందే". అన్న విదానం లో సమాజంలో కట్టు బాట్లు ఉంటే తప్పా నేర కట్టడి సాద్యం కాదు.

                                                        (29/10/2013 post Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

కామ పిశాచులు ని " నిర్భయ" చట్టం నిరోదించలేదని తెలియచేస్తున్న "గార్ల కిరణ్మయి " ఉదంతం

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×