Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీదక్షిణామూర్తి


శ్రీదక్షిణామూర్తి


చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః



తరతరాలనుండీ ఈశ్లోకం వస్తూంది

గురువు మఱ్ఱిచెట్టుమొదట చిన్ముద్రతో మౌనియై శిష్యపరివేష్టితుడై కూర్చుంటాడు. ప్రతి శివాలయంలోనూ దక్షిణాభిముఖంగా అమర్చిన యీ దక్షిణామూర్తి గురువిగ్రహం దక్షిణదిశ ఉన్న గోడలమీద మనకు కనబడుతూ వుంటుంది. అన్ని మూర్తులకంటె శాంతమూర్తి యితడు భైరవుడు బలే ఉగ్రమూర్తి. సోమస్కందుడు కరుణాపూర్ణుడు

ఈశ్వరుడు జడలువిప్పి తాండవం చేసేటపుడు అవి అన్నీ తాండవవేగంచేత ఒకచుట్ట చుట్టుకొని అటులే సూటిగా నిక్కపొడిచికొని ఒకప్రక్కకు అభిముఖాలై ఉంటవి. ఆనర్తంన యొక్క ఔద్ధత్యం ఎంతదో నటరాజవిగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. కాని మఱ్ఱమ్రానిక్రింద కూచున్న దక్షిణామూర్తి జడలన్నీ కిందికి వేలాడుతూ జటామండలంగా ఉంటై

జటామండలమధ్యంలో ఒక చంద్రకళ. అదియే జ్ఞానకళ. జ్ఞానంనానాటికివృద్ధిచెందే వస్తువు. దానికి చిహ్నమో అనేటటులు మూర్తి తదియనాటి చంద్రుని శిరసున పెట్టుకొని ఉండును. చంద్రవతంసుడై శాంతమూర్తియై వెలయు శ్రీదక్షిణామూర్తి స్వరూపదర్శన మాత్రాన మనకు ఎక్కడలేని శాంతీ తానుగాఅమరి ఊరుకుంటుంది. కోపిష్ఠిని గనుక చూస్తే మనకూ కోపంవస్తుంది. దురాలోచనలను చేసే వాళ్ళతో చేరితే మనకున్నూ దురాలోచనలు కలుగుతవి. మన మనోభావాలు ఎంతవిపరీతంగా ఉన్నాసరే దేవాలయానికి వెళ్లి దక్షిణామూర్తిని చూచీచూడగానే వారు - మనోవేగం మాని కాసేపు శాంతంగా కూచుని మరీవెళ్ళు అని చెప్పక చెప్పినట్లు తోస్తుంది. అక్కడ ప్రశ్నకుగాని ప్రతివచనమునకుగాని అవసరం ఉండదు. మాటా మంతీ లేక మౌనంగా కాష్ఠమౌనంగా శాంతంగా మనమున్నూ చతికిలబడవలసిందే

దక్షిణామూర్తి శిల్పం పరిశీలిస్తే శల్యావశిష్టులయిన నలుగురు ఋషులు సాధారణంగా ఎప్పుడూ ఉంటారు. కాంచీ మండలంలోమాత్రం సప్త ఋషులు ఉంటారు

కృతయుగంలో ఎముకలు మాత్రంఉన్నా ఆయుస్సు ఉంటుందని చెబుతారు. వారు అస్థిగతప్రాణులు. అటు తరువాత యుగం అనగా త్రేతలోవారు మాంసగతప్రాణులు. మాంస మున్నంతవరకూ వారికి ప్రాణ ముంటుంది. ద్వాపరయుగంలో రుధిరగతప్రాణులు. వారికి రుధిరమున్నంతవరకు ప్రాణం ఉంటుంది. యుగంలో అన్నగతప్రాణులు. ఇప్పటివారికి అన్న మున్నంతవరకే ఆయువు

కృతయుగంలో ఎముకలు మిగిలేటంతవరకూ తపస్సు చేసేవారు. కాలంలో భృగువు అనే ఆయన తండ్రి వరుణుడనే ఆయనకడకు వెళ్ళి-పూర్ణమయిన వస్తువేదో దానిని ఎట్లా పొందాలో అనిన్నీ బ్రహ్మమనేదే పరిపూర్ణ వస్తువయితే అది ఎల్లకాలమూ ఎల్ల చోటులాలోపం లేకుండా ఉండాలి. అట్టి పూర్ణవస్తువును నాకు మీరు చూపండి అనిన్నీ అడిగాడు

నీవు వెళ్లి తపస్సుచెయ్. నీ యంతట నీకే తెలుస్తుంది అని వరుణు డన్నాడు

భృగువు తపస్సుకు కూచున్నాడు. తపస్సు చేయగా అతనికి శరీరమే చాలా దొడ్డది, ఎంచేతనంటే అన్నింటినీ తెలిసికొనేదిది. ఇది జ్ఞాత. జ్ఞాయముకంటె జ్ఞానశ్రేష్ఠము, అనగా తెలియబడే దానికంటె తెలిసికొనేది శ్రేష్ఠము, అని అతనికి తొలుత తోచిందట. ఆపళంగా అతడు తండ్రికడకు వెళ్ళి అన్నిటికంటే గొప్పదయిన వస్తువును నేను తెలిసికొన్నాను. అది యీ శరీరమే అని తన తపః ఫలమును చెప్పాడు

ఇది విని వరుణుడు ఇంకా కొంతకాలం తపస్సు చేసి చూడు అని కట్టడి చేశారు
ఇట్లా భృగువు కొంతకాలం తపస్సు చేయడమూ కొంత గ్రహించడమూ తాను గ్రహించినదేమో తండ్రికి చెప్పడమూ మళ్ళా కొంత కాలం తపోనియతీ ఇట్లా అయిదుసారులు జరిగింది. కడపటిసారి మాత్రం భృగువు-మీరు చెప్పిన చందంగా ఇంతకాలం తపస్సు చేశాను కాని ఇప్పుడేదో హృదయంలో ఒకానొక ఆనందంస్ఫురిస్తూంది. ఇది యేమిటి? అని తండ్రినడిగాడు

నీకొక ఆనందం స్ఫురిస్తున్నదని అనుచుంటివే అదే ఆనందమే పూర్ణవస్తువు. నీకు ఇపుడిపుడు అలతి అలతిగా స్ఫురిస్తున్నది. క్రమక్రమముగా అభ్యాసంకొలది నడుమనడుమ తెగిపోకుండా సార్వకాలదేశికముగా ఉండిపోతుంది అని తండ్రి చెప్పాడు. ఇదొక కథ

పూర్ణానందసముద్రంలో ఒక తుంపర ఎపుడో ఒకపుడు మనకు అందుంది. దట్టమయిన నీడలు నిండి తీగలచే పూలచే పండ్లచేనిండిన ఒక చెట్టుక్రింద కూచున్నప్పుడు గాలివేస్తే ఆకులు కదలుతవి. వాని సందులనుండి


This post first appeared on Thought Is Life, please read the originial post: here

Share the post

శ్రీదక్షిణామూర్తి

×

Subscribe to Thought Is Life

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×