Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నువ్వు ఎవరు?

 నువ్వు ఎవరు?

.




నా శరీరం నక్షత్ర ధూళి,

నా జీవితం ఎన్నో సంభావ్యతల హేళి !

నా ఆలోచన నూతిలో కప్పల కేళి !

.

నాకు ముందు నేను లేను,

నా తరువాత నేను లేను !

నాకు స్పృహ ఉంటే నాకు నేను ఉంటాను,

లేదంటే కేవలం నా చుట్టూ వారికి ఉంటాను !

.

నా ఆలోచనలు 

నాకు ముందు వచ్చిన వారివి, వాటి నుంచి

నా చుట్టూ ఉన్నవారు మరియు 

నేను అనుకున్నవి !

.

ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ, 

నేను లేనప్పుడు కూడా ఉండేది/ఉంటుంది మహా అయితే ఇంకోలా !

.

కాబట్టి నేను అంటే నా ఉనికి మాత్రమే

నేనంటే నేను మాత్రమే !

.

మీరేమంటారు?



This post first appeared on Thought Is Life, please read the originial post: here

Share the post

నువ్వు ఎవరు?

×

Subscribe to Thought Is Life

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×