Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...జాగ్రత్తలు


వేసవి కాలంలో వేడి గాలుల ఉదృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వేసవికాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోవలసినది డీహైడ్రేషన్‌. ఆ తర్వాత టైఫాయిడ్‌, గ్యాసో్ట్ర, యూరినరీ సమస్యలు వస్తు ఉంటాయి. అందువల్ల ఈ వేసవికాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పై సమస్యల బారిన పడటం ఖాయం. అందువల్ల ఈ వేసవి కాలంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు.

ఎండ ఎక్కువగా ఉండుట వలన చాలా మంది వడదెబ్బకు గురి కావటం జరుగుతుంది. అంతేకాక డయాబెటిస్‌, గుండెజబ్బులు, బీపి ఉండేవారు ఇంకా అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు ఏమి లేకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. అలాగే గంటకు రెండు సార్లు నీటిని త్రాగటం మరియు మజ్జిగ ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.

CLICK HERE : మోకాలు,మోచేతుల నలుపు పోవాలంటే.... 


ఎండాకాలంలో ఆహారం తొందరగా పాడవుతుంది. ఎందుకంటే వేసవిలో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది. దాంతో కడుపులో తిప్పటం వంటివి జరుగుతాయి . ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని తినటం వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. వేసవిలో తాజా ఆహారాన్ని తీసుకోవటమే మంచిది.

CLICK HERE : పెదాలు సన్నగా ఉన్నాయా.... లావుగా కనపడటానికి చిట్కాలు 

వేసవిలో కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌, మిల్క్ షేక్స్‌ తీసుకోవటం కన్నా కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవటం చాలా మంచిది. అలాగే కీరా, పుదీనా నీళ్లు, కాకరకాయ, పుచ్చకాయ వంటి వాటిని తీసుకుంటే ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడవచ్చు.

CLICK HERE : బనానా దోస 

చిన్న పిల్లలపై వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్‌ సమస్యలతో పాటు యూరినల్‌ సమస్యలు వస్తాయి. అందుకే నీటిని ఎక్కువగా త్రాగించాలి. ఆహారం తినే ముందు పిల్లల చేతులు శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని నీరు, ఐస్‌క్రీమ్స్‌ తినిపించటం వల్ల గొంతు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వేసవిలో డబ్లు.హెచ్‌.ఓ రెకమెండ్‌ చేసిన ఓఆర్‌ఎస్ (ఓరల్‌ డీహైడ్రేషన్‌ సాల్ట్‌)ను పిల్లలకు ఇవ్వటం
ఆరోగ్యకరం.


CLICK HERE : కసూరి పన్నీర్ టిక్కా 


    This post first appeared on Blogger, please read the originial post: here

    Share the post

    వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...జాగ్రత్తలు

    ×

    Subscribe to Blogger

    Get updates delivered right to your inbox!

    Thank you for your subscription

    ×